టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) బయటకు రావాలని ఆ పార్టీ నేతలంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఆయన 45 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఆయన బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.దీంతో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో అనే సందిగ్ధత అందరిలోనూ నెలకొంది.
స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్ స్కామ్, అంగళ్ళు.ఇలా లెక్కకు మించి కేసులు ఆయన చుట్టూ ఉన్న సంగతి తెలిసిందే.
![Telugu Acb, Amaravati Road, Ap Skill Scam, Chandrababu, Fiber Grid Scam, Lokesh, Telugu Acb, Amaravati Road, Ap Skill Scam, Chandrababu, Fiber Grid Scam, Lokesh,](https://telugustop.com/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-Amaravati-Inner-Ring-Road-Case-ACB-Court-ycp-Supreme-Court.jpg)
ఈ కేసుల విషయంలో కోర్టులు కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబుకు షాక్ ఇస్తూనే ఉన్నాయి.స్కిల్ స్కామ్ విషయంలో రిమాండ్ పొదిగిస్తూ ఏసీబీ కోర్టు( ACB Court ) ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.దీంతో నవంబర్ 1 వరకు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.ఆరోజైన చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా అంటే చప్పలేని పరిస్థితి.ఇక ఫైబర్ నెట్ స్కామ్( Fiber Grid Scam ) లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.బాబు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
కానీ టీడీపీ శ్రేణులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఇక తాజాగా దీనిపై అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కూడా చంద్రబాబును ఉలిక్కి పడేలా చేసింది.
![Telugu Acb, Amaravati Road, Ap Skill Scam, Chandrababu, Fiber Grid Scam, Lokesh, Telugu Acb, Amaravati Road, Ap Skill Scam, Chandrababu, Fiber Grid Scam, Lokesh,](https://telugustop.com/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-Amaravati-Inner-Ring-Road-Case-Nara-Lokesh-YS-Jagan-Mohan-Reddy-ACB-Court-ycp-Supreme-Court.jpg)
ముందస్తు బెయిల్ పై విచారణను వచ్చే నెల 8న చేపడతామని చెబుతూ సుప్రీం కోర్టు ( Supreme Court )వాయిదా వేసింది.దీంతో ఒక కేసు నుంచి బయటపడిన మరో కేసు చంద్రబాబు మెడకు గట్టిగా చుట్టుకునేలా కనిపిస్తుందనేది రాజకీయ అతివాదులు చెబుతున్నా మాట.పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల సమయానికి కూడా బాబు బయటకు రావడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు బయటకు రాకపోతే అసలు టీడీపీ పరిస్థితి మరింత క్షీణించే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ హోల్డ్ లో పడిపోయాయి.ప్రస్తుతం బాబు అరెస్ట్ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళుతు సానుభూతి పొందాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.
మొత్తానికి చంద్రబాబు బయటకు రాకపోతే పార్టీ అధోగతి పాలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.