కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రూ.లక్ష కోట్ల ఖర్చు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో రాహుల్ గాంధీ చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.కుంభకోణాలతో జైళ్లకు వెళ్లింది మీ పార్టీ నేతలు కాదా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని సూచించారు.రైతులకు రుణమాఫీ చేయలేదనడం కూడా దుర్మార్గమన్న మంత్రి నిరంజన్ రెడ్డి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు.







