స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు ఏపీ హైకోర్టు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
లంచ్ బ్రేక్ తరువాత విచారణ చేస్తామని రాష్ట్ర హైకోర్టు తెలిపింది.మరోవైపు ఇదే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనున్న సంగతి తెలిసిందే.
దీంతో చంద్రబాబు రిమాండ్ ను పొడిగించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.







