శ్రీశైలం ప్రాజెక్టు ఎవరబ్బ జాగీరు..?: కేసీఆర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మార్పు రావాలనే ఎంపీగా పోటీ చేశానని తెలిపారు.

 Srisailam Project Who's Jagir..?: Kcr-TeluguStop.com

మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించానని కేసీఆర్ పేర్కొన్నారు.కృష్ణా నది పక్కనుంచే పారుతున్నా గతంలో జిల్లా పరిస్థితి మారలేదన్నారు.

కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశామని తెలిపారు.జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని ఆంధ్ర సీఎంలు కుట్రలు చేశారన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు ఎవరబ్బ జాగీరన్న కేసీఆర్ మన పైసలు లేవా అని ప్రశ్నించారు.పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చామని చెప్పారు.

అయితే ఇప్పటికీ జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని కొందరంటున్నారని తెలిపారు.జూరాల చిన్న ప్రాజెక్టు అని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నింపేందుకు జూరాల నీళ్లు సరిపోవని వెల్లడించారు.3, 4 నెలల్లో పాలమూరు ఎత్తిపోతల పారుతుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube