బీఆర్ఎస్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ డబ్బులపై ఆధారపడి ఉందన్న ఆయన రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడటం లేదన్నారు.
బీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలు అన్నీ పేపర్లకే పరిమితం అయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.విద్య, వైద్య రంగాలకు నిధులు తగ్గించారన్నారు.
దీంతో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.మరోవైపు కాంగ్రెస్ నేతల పర్యటనపై స్పందించిన కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ, ప్రియాంక ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్న ఆయన 1200 మంది ఆత్మ బలిదానాలకు కారణం ఎవరని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని వెల్లడించారు.







