తెలంగాణలో గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ( Congress ) మరియు కమ్యూనిస్ట్ పార్టీల మద్య పొత్తు ఊగిసలాడుతోంది.వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికి సీట్ల విషయంలో మాత్రం సర్దుబాటు జరగడంలేదు.
ఇప్పటికే ఈ రెండు పార్టీల మద్య పలు మార్లు చర్చలు జరిగినప్పటికి సఫలం కాలేదు.గతంలో సిపిఐ మరియు సిపిఎం( CPI(M) ) పార్టీలకు పది సీట్ల మేర కేటాయించాలని డిమాండ్ చేయడంతో హస్తం పార్టీ కాస్త వెనుకడుగు వేసింది.
ఆ తరువాత ఈ రెండు పార్టీలు స్వతంత్రంగా బరిలోకి దిగుతాయనే వార్తలు వచ్చినప్పటికి.తీరు చూస్తుంటే కలిసే పోటీ చేయాలని భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది.
కాగా మొదట్లో పది సీట్లు డిమాండ్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు.ఆ తరువాత వెనక్కి తగ్గి ఐదు సీట్లు కేటాయిస్తే చాలానే అభిప్రాయానికి వచ్చాయి.కానీ హస్తం పార్టీ ఐదు సీట్లు కేటాయించడానికి కూడా ససేమిరా అంటుండడంతో కమ్యూనిస్ట్ పార్టీలు డైలమాలో పడ్డాయి.ఇక ఎట్టకేలకు సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీల మద్య పొత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
సీపీఐ కి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను ( Kothagudem )తొలి జాబితాలో కేటాయించి పొత్తు కన్ఫర్మ్ చేసింది హస్తం పార్టీ.ఇక సిపిఎం విషయానికొస్తే.తొలి జాబితాలో ఎలాంటి సీట్ల కేటాయింపు జరపలేదు రెండో జాబితాలో సిపిఎంకు ఏ ఏ స్థానాలను కేటాయిస్తారనేది సస్పెన్స్ గా మారింది.మునుగోడు, మిర్యాలగూడ సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోందట.
ఈ రెండు స్థానాల పట్ల సిపిఎం సానుకూలంగానే ఉన్నప్పటికి మరో రెండు స్థానాలను కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచనలో సిపిఎం నేతలు ఉన్నట్లు సమాచారం.మరి కామ్రేడ్ లతో కలిసి హస్తం పార్టీ రాబోయే ఏన్నికల్లో ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.