ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు దసరా కానుక ప్రకటించింది.
ఈ మేరకు ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.దీంతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది.అలాగే రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ప్రకటించింది.2024-25 కు గానూ ఆరు రబీ పంటలకు మద్ధతు ధర పెంచింది.కందులు క్వింటాల్ కు రూ.6,425 మద్ధతు ధర, గోధుమ మద్ధతు ధర క్వింటాల్ రూ.2,275, బార్లీ మద్ధతు ధర క్వింటాల్ రూ.1,850కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.