టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో 17ఏ వర్తింపుపై ఎస్ఎల్పీపై తీర్పు ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.
విచారణను నవంబర్ కు వాయిదా వేయాలని కోరారు.ఈ వాదనల నేపథ్యంలో ఏపీ హైకోర్టు పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
అదేవిధంగా అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు అవుతుందని పేర్కొంది.అయితే ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.







