కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ( Telangana ) లో బస్సు యాత్ర ప్రారంభించబోతుంది.ఇక ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ నాయకులతోపాటు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు.
అయితే ఇప్పటికే ఈ యాత్ర చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది.మొదట్లో ఈ నెల 15 న కొండగట్టు నుండి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వార్తలు వినిపించినప్పటికీ అది వాయిదా పడింది.
ఇక ఈరోజు సాయంత్రం ములుగు (Mulugu) జిల్లా నుండి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉంటే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ బస్సు యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే మరి ఈ బస్సుయాత్రలో కాంగ్రెస్ నాయకులు ప్రజల మనసును దోచుకుంటారా.
అప్పటి సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

2004 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ( Andrapradesh ) రాష్ట్రంలో కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలుపెట్టింది.ఇకఆ యాత్రలో అప్పటి సీనియర్ నాయకులతో పాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి మిగిలిన వారందరూ ఓకే బస్సులో కూర్చుని వారి మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి బస్సు యాత్రను సక్సెస్ చేశారు.ఇక ఈ బస్సు యాత్రని అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి నుండి స్టార్ట్ చేశారు.
అలా స్టార్ట్ చేసినప్పుడు గ్రామాలలోని కూడళ్ల వద్ద ప్రసంగాలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి వివరించి సక్సెస్ అయ్యారు.ఇక ఆ ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y.S.Rajashekhar reddy ) కాంగ్రెస్ తరపున గెలిచి సీఎం అయ్యారు.అలాగే ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి.

ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అక్కడ కూడా బస్సు యాత్రని ప్రారంభించి ప్రజల్లోకి నాయకులు వెళ్లి ప్రజల మనసులు గెలుచుకొని కర్ణాటకలో కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు.అయితే తాజాగా తెలంగాణలో కూడా ఈ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు.మరి ఇప్పుడు కాంగ్రెస్ బస్సు యాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.
మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.







