టీడీపీ నేతలపై పోలీసుల నిర్బంధం సరికాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.ఈ క్రమంలో ఇదేం చట్టం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వ వైఖరి ఎంతో బాధించిందని భువనేశ్వరి అన్నారు.వ్యవస్థల నిర్వీర్యం అని చంద్రబాబు ఎందుకు ఆందోళన చెందేవారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతోందని చెప్పారు.
కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత హక్కులు, సంప్రదాయాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని అధికారులను కోరుతున్నానని వెల్లడించారు.