ఈ ఐరన్ రిచ్ గ్రీన్‌ స్మూతీని వారానికి 2 సార్లు తీసుకున్న చాలు రక్తహీనత మళ్ళీ మీ వైపు చూడ‌దు!

రక్తహీనత( anemia ).ప్రధానంగా మహిళల్లో, పిల్లల్లో కనిపిస్తుంటుంది.

 Best Iron Rich Green Smoothie For Anemia Patients! Iron Rich Green Smoothie, Gre-TeluguStop.com

పిల్లల్లో పోషకాహార లోపం కారణ‌మైతే.మహిళల్లో నెలసరి, ప్రెగ్నెన్సీ వంటివి రక్తహీనతకు దారితీస్తుంటాయి.

అలాగే మలేరియా లాంటి విష జ్వరాలు సోకినా ర‌క్త‌హీన‌త త‌లెత్తుతుంటుంది.ఏదేమైనా రక్తహీనతను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం.

అందుకే రక్తహీనతను త‌రిమి కొట్టడానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోవాలి.అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ స్మూతీ కూడా ఒకటి.

Telugu Anemia, Green Smoothie, Tips, Iron, Ironrich, Latest-Telugu Health

ఈ స్మూతీలో ఐరన్ మెండుగా ఉంటుంది.వారానికి కేవ‌లం రెండు సార్లు దీనిని తీసుకుంటే చాలు రక్తహీనత మళ్ళీ మీ వైపు చూడదు.మ‌రి ఇంత‌కీ ఆ ఐర‌న్ రీచ్ గ్రీన్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు తరిగిన పుచ్చకాయ ముక్కలు( Watermelon ) వేసుకోవాలి.

అలాగే ఒక అరటిపండు తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.

Telugu Anemia, Green Smoothie, Tips, Iron, Ironrich, Latest-Telugu Health

వీటితో పాటు బ్లెండర్ లో నాలుగు ఫ్రెష్ పాలకూర ఆకులు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన ఐరన్ రిచ్ గ్రీన్ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ రక్తహీనత తో బాధపడుతున్న వారికి చాలా మేలు చేస్తుంది.

వారానికి కనీసం రెండు సార్లు ఈ స్మూతీని తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ అందుతుంది.హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.ఫ‌లితంగా రక్తహీనత పరార్ అవుతుంది.అంతేకాదు ఈ గ్రీన్ స్మూతీ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.లివర్, మూత్రపిండాలను క్లీన్ గా మారుస్తుంది.

కంటి చూపును పెంచుతుంది.మరియు చర్మాన్ని నిగారింపుగా సైతం మెరిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube