ఇంకా కొద్ది రోజుల్లో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ( Lavanya tripathi,Varun Tej ) లు భార్యాభర్తలు అవ్వబోతున్నారు.ఇక ఎప్పుడయితే వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని వార్తలు వినిపించాయో అప్పటినుండి ఎంగేజ్మెంట్ జరిగి ప్రివెడ్డింగ్ షూట్ జరిగి ఇలా ఎన్ని ఫంక్షన్లు జరిగినా కూడా వీరి గురించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇప్పటికే లావణ్య త్రిపాటికి సంబంధించి అలాగే వరుణ్ తేజ్ కు సంబంధించిన కొన్ని ఎఫైర్ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.వరుణ్ తేజ్ కంటే ముందే లావణ్య త్రిపాటి ఆ హీరోని ప్రేమించిందని,లావణ్య త్రిపాఠి కంటే ముందే వరుణ్ తేజ్ ఆ హీరోయిన్ ని ప్రేమించారని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి కంటే ముందే మరో హీరోయిన్ ని ప్రేమించారని, అన్నీ అనుకుంటే మెగా ఇంటికి కోడలుగా ఆ హీరొయినే వచ్చి ఉండేది అని టాలీవుడ్ లో ఒక టాక్ వినిపిస్తోంది.
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద ( Mukunda movie ) హీరోయిన్ పూజ హెగ్డే.పూజ హెగ్డే వరుణ్ తేజ్ కలిసి చేసిన ముకుంద సినిమా అంతగా హిట్ కానప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ బాగా సెట్ అయింది.ఎందుకంటే ఇద్దరు మంచి హైట్.
దాంతో వీరికి మంచి గుర్తింపు లభించింది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ పూజ హెగ్డే మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో నడుస్తుంది అని వార్తలు వినిపించాయి.అంతేకాదు ఈ సినిమాలో నటించే సమయంలో పూజ హెగ్డే ( Pooja hegde ) కి వరుణ్ తేజ్ చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇచ్చేవాడని,షూటింగ్ అయిపోయాక పార్టీలకు వెళ్లే వారని కూడా అప్పట్లో మీడియాలో టాక్ వినిపించింది.
అయితే వరుణ్ తేజ్ ఆ సమయంలో పూజ హెగ్డే ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ నాగబాబు వీరి విషయంలో కలుగజేసుకొని వరుణ్ తేజ్ కి వార్నింగ్ ఇవ్వడంతో అక్కడితో ఆ ప్రేమకి చెక్ పడింది అని వార్తలు వినిపించాయి.ఎందుకంటే అప్పటికీ వరుణ్ తేజ్ కి అది ఫస్ట్ సినిమా మాత్రమే.
దాంతో నాగబాబు ( Nagababu ) తన కొడుకు సినీ కెరీర్ ఏమవుతుందో అని ఇంటికి పిలిపించుకొని మరీ నువ్వు నటించింది ఒక్క సినిమా మాత్రమే.ఒక్కదానికే ఇలా ప్రేమ పెళ్లి అంటూ ముందుకు వెళ్తూ ఉంటే నీ సినీ కెరీర్ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించు.నువ్వు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు.ముందుగా సినిమాల్లో సక్సెస్ అవ్వు లేకపోతే బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చారట.ఇక నాగబాబు వార్నింగ్ తో వరుణ్ తేజ్ పూజ హెగ్డే కి దూరమయ్యాడని ముకుంద సినిమా షూటింగ్ సమయంలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.