రాజకీయరంగ మైనా వ్యాపార రంగమైనా ఏకస్వామ్యం అన్నది ఆమోద యోగ్యం కాదు.ప్రజాస్వామ్యంలో అన్ని రకాల భావనలకు చోటు ఉండాలి.
రాజకీయంగా కేంద్రంలో భాజపా( BJP )కు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం ఆ పార్టీ తీసుకున్న కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు అడ్డుకట్ట లేకుండా పోతుందన్నది రాజకీయ విశ్లేషకులు భావన.ఒకప్పుడు దేశాన్ని ఏకచాత్రదిపత్యం తో ఏలిన కాంగ్రెస్ కాలక్రమం లో తన స్వయం తప్పిదాలతోనూ అనేక కారణాలతో ప్రాంతీయ పార్టీలు బలపడటంతోను తన ప్రభను కోల్పోయింది.
ఆ తర్వాత హిందుత్వ అజెండాను ప్రధాన ఎన్నికల అంశం గా మార్చుకోవడంలో విజయవంతమైన భాజపా మెజారిటీ హిందువులను తన వైపు తిప్పుకోవడంతో పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చింది.భాజాప ప్రభుత్వం పై పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ ప్రజాస్వామ్య విధానాలను పట్టించుకోకుండా కొంత నియంతృత్వ దొరణితో భాజపా వెళ్తుందన్న ఆరోపణలు మాత్రం వచ్చాయి.
ముఖ్యంగా అనేక కీలక నిర్ణయాలలో ప్రజా వ్యతిరేకతను పట్టించుకోకపోవడం, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటం, క్రీడా రంగంలో వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత వైఖరి తో లేకపోవడం ప్రతిపక్ష నేతలపై ఈడీ , సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేయించడం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడం వంటి చర్యలు భాజపా ఇమేజ్ కు భారీగానే గండి కొట్టాయి .

భాజాపాకు ప్రత్యామ్నాయ పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ ఎదగకపోవడమే ఈ పరిణామాలకు కారణమని చాలా మంది భావించారు.అయితే చాలాకాలం తర్వాత కాంగ్రెస్ కు పునరుజ్జీవనానికి అవకాశం లభించింది .ప్రభుత్వ వ్యతిరేకతను కొంత స్థాయిలో అందిపుచ్చుకున్న కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రాని గెలవగలిగింది.ఇప్పుడు రాబోయే ఐదు రాష్ట్రాలు ఎన్నికలలో కూడా కీలక ప్రభావం చూపించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.అయితే రాహుల్ గాంధీ( Rahul gandhi ) ఇమేజ్ కన్నా మోడి ప్రభుత్వంపై వ్యతిరేకత తోనే కాంగ్రెస్కు లాభపడుతున్న వాతావరణం కనిపిస్తుంది.
తాను అధికారంలోకి వస్తే దేశాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడో రాహుల్ గాంధీ స్పష్టమైన నమ్మకం దేశ ప్రజలకు ఇప్పటివరకూ కల్పించలేదనే చెప్పాలి.

అయితే మోడీ ప్రభుత్వం పై( Narendra Modi ) వస్తున్న వ్యతిరేకతే ఒక కాంగ్రెస్ కు టానిక్ లా మారింది .ఇప్పుడు అందుకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుపుచ్చుకొని ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిస్థాయిలో చర్చ నీయాంశం గా మారిస్తే కాంగ్రెస్ మరోసారి కేంద్రం లో నిర్ణయాత్మక శక్తి గా మారుతుంది.మరి అత్యంత కీలకమైన ఈ సమయంలో కాంగ్రెస్ మానియా పనిచేస్తుందా? జరగబోతున్న ఎన్నికలలో మెజారిటీ రాష్ట్రాలను చేజిక్కించుకుంటే మాత్రం కాంగ్రెస్ మరోసారి దేశ యువనికపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు.







