ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో సైతం బన్నీకి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బన్నీ సినిమాలు భాషతో సంబంధం లేకుండా థియేటర్లలో, ఓటీటీలలో, యూట్యూబ్ లో సైతం సంచలనాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో బన్నీకి ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే.
రియల్ లైఫ్ లో సైతం స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడే అల్లు అర్జున్ తాజాగా చేసిన ఒక పని ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని( Allu Arjun Fan ) దగ్గరకు వెళ్లి బన్నీ తన ఆటోగ్రాఫ్( Autograph ) ఇచ్చారు.
చిన్నారి అభిమాని అడిగిన వెంటనే తాను స్టార్ హీరో అయినప్పటికీ అభిమాని పేరు, ఇతర వివరాలను తెలుసుకుని మరీ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు.బన్నీ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బన్నీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తారని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇప్పటికే నలుగురు యంగ్ జనరేషన్ హీరోలతో సినిమాలు చేసిన రాజమౌళి( Rajamouli ) అల్లు అర్జున్ పై కూడా దృష్టి పెడితే బాగుంటుంది.మహేష్ తో ( Mahesh Babu ) సినిమా తర్వాత బన్నీతో రాజమౌళి సినిమాను ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అల్లు అరవింద్ తో ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టి జక్కన్న బన్నీతో సినిమా ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బన్నీలా ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడే హీరోలు చాలా అరుదుగా ఉంటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఆ చిన్నారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీ భవిష్యత్తులో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు వేస్తున్నారు.







