వేరుశనగ సాగు ప్రారంభంలో చేపట్టవలసిన పద్ధతులు..!

వేరు శనగ పంటను( Groundnut Cultivation ) నూనె పంటలలో ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు.వేరు శనగను యాసంగిలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు.

 Methods To Be Undertaken At The Beginning Of Groundnut Cultivation , Groundnut-TeluguStop.com

ఈ పంట సాగుకు తేలికపాటి నేలలు మరియు నల్లరేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.వ్యవసాయం చేసే రైతులు( Farmers ) ముఖ్యంగా అవగాహన ఏర్పరుచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే.

సాగు ప్రారంభానికి ముందే ఆ పంటకు సంబంధించిన అన్ని విషయాలపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి.సాగు ప్రారంభంలో ఏవైనా పొరపాట్లు జరిగితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.

కాబట్టి మనం వేరుశనగ పంట ప్రారంభానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

పంట ఏదైనా కూడా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం.

విత్తన శుద్ధి వల్ల దాదాపుగా సగానికి పైగా రసాయన పిచికారి ఎరువుల వాడకం తగ్గించవచ్చు.నేల నుండి ఎలాంటి తెగుళ్లు పంటను ఆశించలేవు.

ఒక కిలో వేరుశనగ విత్తనాలకు 1గ్రాము టెబ్యుకొనజోల్ లేదా 3గ్రా.మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి.

Telugu Agriculture, Farmers, Groundnut Crop, Groundnut, Latest Telugu, Pest, See

వేరుశనగకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే కాండం కుళ్ళు వైరస్ తెగులు ( pest )అనేవి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.కాబట్టి వేరుశనగ పండించే నేలలో ఇంతకుముందు వేసిన పంటకు ఈ తెగులు కనుక ఆశించి ఉన్నట్లయితే.20 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ 7మి.లీ.ను నీటిలో కలిపి విత్తనాలకు పట్టించాలి.కిలో వేరుశనగ విత్తనాలకు 10 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి( Trichodermaviridae ) పట్టించి ఆ తర్వాత విత్తనాలు( seeds ) ప్రధాన పొలంలో నాటుకుంటే వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు, కాండం కుళ్ళు తెగులు లాంటివి ఆశించవు.

Telugu Agriculture, Farmers, Groundnut Crop, Groundnut, Latest Telugu, Pest, See

యాసంగిలో నీటిపారుదల కింద సాగు చేస్తే.22.5-10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి.ఖరీఫ్ లో సాగు చేస్తే ఒక చదరపు మీటర్ కి 38 మొక్కలు ఉండేలా.యాసంగి లో ఒక చదరపు మీటర్ కి 44 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి.

ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు ( Weed control )చేపడితే వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించడానికి అవకాశం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube