వైరల్: ఏకంగా తాసీల్దార్ ఆఫీసులోకి చొరబడి, ఫైళ్లను పరీక్షించిన కోతి?

సోషల్ మీడియా( Social media ) వినియోగంలోకి వచ్చిన తరువాత అనేక రకాల విషయాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.సహజంగా మనలో ఎవరైనా అతిగా అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయొద్దు! అని అంటూ వుంటాం.

 Viral: A Monkey Who Broke Into The Tahsildar's Office And Examined The Files? ,-TeluguStop.com

కానీ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ కోతిని చూసి జనాలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.అవును, దాని తీరుకు ఆశ్చర్యపోతున్నారు నెటిజనం.

ఉత్తర ప్రదేశ్‌( Uttar Pradesh )లో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ కావడం మనం గమనించవచ్చు.ఈ వీడియో సంగతికి వస్తే, సహారన్‌పూర్‌లోని ఓ తాసీల్దార్ ఆఫీసులోకి కోతి ఇటీవల అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది.

కోతి రావడంతో అక్కడి వారందరూ దాన్ని వెళ్లగొట్టేందుకు అప్రమత్తమయ్యారు.కానీ, అంతలోనే కోతి ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది.

వచ్చీ రావడంతోనే ఎదురుగా కనిపిస్తున్న కొన్ని ఫైళ్ల వద్దకు వెళ్లి కూర్చుని వాటిని ఎంచకా తిరగేయడం ప్రారంభించింది.ఏదో భారీ బాధ్యత తనపై ఉన్నట్టు ఒక్కో కాగితాన్ని తిరగేస్తు చాలా బిజీగా గడిపింది.కాగా ఇదంతా చూస్తూ ఉన్నవారికి అసలేం జరుగుతోందో అర్థం కాలేదు.ఇంతలో పక్కనే ఉన్న సిబ్బంది ఒకరు దాని ముందు ఓ అరటి పండు( Banana ) పెట్టారు.

కానీ తొక్కలో అరటిపండు ఎవరికి కావాలి? అన్నట్టు చూసి, పండును పట్టించుకోకుండా తన మానన తాను ఫైళ్లు తిరగేయడంలో బిజీ అయిపోయింది.

దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో సూపర్ పాస్ట్ గా దూసుకుపోతోంది.ఇక నెట్టింట్లో ఈ వీడియోని చూసి జనాలు కిందామీదాపడి పడపడీ నవ్వుకుంటున్నారు.కోతికి అరటి పండు లంచంగా ఇచ్చినా కూడా తన బాధ్యతను మర్చిపోలేదు అని సరదా సరదా కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరైతే ఆ జాబ్ ఏదో మనుషులకు బదులు దానికే ఇవ్వండి… చాలా బాగా వర్క్ చేస్తోంది అని కామెంట్స్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube