మెగా ఫ్యామిలీలో ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యి అందరూ హడావిడిగా పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు.లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ( Lavanya tripathi, Varun tej ) ఇద్దరు తమ పెళ్ళికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ ని కూడా పూర్తి చేసుకున్నారు.
ఇక పెళ్లి విషయంలో ఫోటోలలో ఇబ్బందులు పడకుండా ముందే అన్ని ముగించుకున్నారని తెలుస్తోంది.అలాగే ఇప్పటికే పెళ్లి బట్టలు, నగలు అన్ని షాపింగ్ అయిపోయాయని, పెళ్లి వేదిక కూడా ఫిక్స్ చేసి డెకరేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా ఖాతాలో పెట్టింది బయట పెట్టింది ఉపాసన ( Upasana ).ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా పెళ్లికి ముందే అల్లు వారి ఇంట్లో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి ప్రీ వెడ్డింగ్ పార్టీని ఇచ్చారు.

ఇక ఈ పార్టీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో పాటు నాగబాబు( Nagababu ) , చిరంజీవి, సురేఖ, పద్మజ, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అర్జున్,స్నేహ రెడ్డి, అల్లు అరవింద్, ఉపాసన,వైష్ణవ్ తేజ్ వంటి వాళ్ళు పాల్గొన్నారు.అయితే వీరందరూ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ అయినప్పటికీ వీరిలో నితిన్ ఆయన భార్యతో కలిసి వచ్చారు.అలాగే మరో హీరోయిన్ రీతు వర్మ ఈ పార్టీలో కనిపించేసరికి అందరిలో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి.
ఎందుకంటే వరుణ్ తేజ్ ఫ్రెండ్ నితిన్( Nithiin ) కాబట్టి ఆయన ఆ పార్టీకి వచ్చారు అనడంలో అర్థం ఉంది.

కానీ రీతు వర్మ ( Ritu Varma ) ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో కూడా సినిమాలో నటించడం లేదు.అలాంటిది ఈ ఫంక్షన్ లో రీతూ వర్మ ఎందుకు వచ్చింది అని కొంతమందిలో డౌట్స్ పుట్టుకొస్తాయి.అయితే ఓ మెగా హీరోతో రీతూ వర్మ కి మంచి ఫ్రెండ్షిప్ ఉందట.
అందుకే ఈ పార్టీకి వచ్చినట్టు తెలుస్తుంది.కానీ ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో అందరూ మెగా ఫ్యామిలీలోని ఆ హీరోతో రీతూ వర్మ ప్రేమలో పడిందని, అందుకే ఆ ఫంక్షన్ కి వచ్చిందని చెబుతున్నారు.
అయితే ఈ వార్తలని కొంతమంది కొట్టి పారేస్తున్నప్పటికి కొంతమంది మాత్రం నిజమే అంటున్నారు.ఎందుకంటే లావణ్య త్రిపాఠి కూడా వరుణ్ తేజ్ తో లవ్ ట్రాక్ నడిపించిన సమయంలో మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్లో కనిపించేది.
కానీ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ వారి ప్రేమ వార్తలు దాటేసేవారు.అయితే ఇప్పుడు రీతూ వర్మ కూడా మెగా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్ లో కనిపించేసరికి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.
మరి రీతూ వర్మ ( Ritu Varma ) ప్రేమించే మెగా హీరో ఎవరు.నిజంగానే రీతూ వర్మ కి ఆ హీరోకి మధ్య ప్రేమ ఉందా.
లేదా జస్ట్ ఫ్రెండ్షిప్ తోనే ఆ పార్టీకి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.







