ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ( Technology ) రంగం శరవేగంగా మార్పు చెందుతోంది.ఈ క్రమంలో భద్రత అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారయ్యింది.
బేసిగ్గా మనం మనకు అవసరమైన ముఖ్యమైన ఫైల్స్, ఫొటోలు, వీడియోలు వంటివి మన కంప్యూటర్ లేదా ఫోన్స్‌లో భద్రపరుస్తాం.అయితే అవి అంతకుమించి చాలా కాన్ఫిడెన్సియల్ అయితే ఆ ఫైల్స్ మరింత జాగ్రత్త యూఎస్‌బీ డ్రైవ్స్( USB drives ) వంటి వాటిలో జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటారు.
ముఖ్యంగా పెట్టుబడికి సంబంధించిన ఫైల్స్, బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు, పొదుపునకు సంబంధించిన వివరాలు పెన్‌డ్రైవ్స్‌లో భద్రపరుస్తూ ఉంటారు.

ఇక అక్కడ వరకూ బాగానే ఉన్నా అనుకోని పరిస్థితుల్లో వాటిని పోగొట్టుకున్నా లేదా అవి వేరే వారికి దొరికినా సింపుల్‌గా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి అందులోని వివరాలను దొంగిలిస్తారు కొందరు కేటుగాళ్ళు.అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఫింగర్ ప్రింట్ పెన్‌డ్రైవ్స్‌ను లెక్సార్ కంపెనీ లాంచ్ చేసింది.లెక్సార్( Lexar ) అనేది ప్రముఖ గ్లోబల్ ఫ్లాష్ మెమరీ సొల్యూషన్స్ ప్రొవైడర్.ఈ కంపెనీ లెక్సార్ జంప్ డ్రైవ్ ఎఫ్ 35 3.0( Lexar Jump Drive F35 3.0 ) పేరుతో డేటా భద్రతను అందించడానికి వేలిముద్ర గుర్తింపు సాంకేతికతతో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఇపుడు మార్కెట్లోకి తీసుకు వచ్చింది.ఈ జంప్‌డ్రైవ్ ఎఫ్35 వినియోగదారులను ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ ద్వారా తమ సెన్సిటివ్ డేటాను రక్షించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ పెన్‌డ్రైవ్ డేటా గోప్యతను నిర్ధారిస్తూ గరిష్టంగా 10 వేర్వేరు వేలిముద్రలను నిల్వ చేయగలదు అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

లెక్సార్ జంప్ డ్రైవ్ యూఎస్‌బీ 3.0 మద్దతుతో వస్తుంది.గరిష్టంగా 300 ఎంబీపీఎస్ బదిలీ వేగంతో ఇది పని చేయగలదు.
గరిష్టంగా 10 వేలిముద్ర ఐడీలకు మద్దతునిస్తుంది.ఒక సెకనులోపు అతివేగవంతమైన గుర్తింపు, సాఫ్ట్‌వేర్ డ్రైవర్లు అవసరం లేకుండా సులభంగా దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు.కాగా ఈ పెన్‌డ్రైవ్‌పై 3 సంవత్సరాల వారెంటీను ఇస్తుండడం విశేషం.32 జీబీ లెక్సార్ జంప్ డ్రైవ్ ధర రూ.4,500గా ఉంది.64 జీబీ మోడల్‌కు రూ.6,000కు అందుబాటులో ఉంది.ఈ పెన్‌డ్రైవ్‌లను వివిధ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.







