మహేష్ బాబు - రేణు దేశాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా, అకిరా నందన్ తల్లిగా రేణు దేశాయ్( Renu Desai ) కి ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సోషల్ మీడియా లో కూడా ఈమె తరచూ యాక్టీవ్ గా ఉంటుంది.

 Renu Desai Missed Mahesh Babu Movie Chance,renu Desai,mahesh Babu,tiger Nageswar-TeluguStop.com

పూణే నుండి మోడల్ గా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న రేణు దేశాయ్, ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఆడిషన్స్ ద్వారా ఈమెని బద్రి సినిమాకి సెలెక్ట్ చేసుకున్నాడు.అలా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో పరిచయం ఏర్పడి, అతనితో ప్రేమలో పడిపోయింది.

కొంత కాలం డేటింగ్ చేసుకున్న ఈ జంట తర్వాత పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత కొన్నాళ్ళకు విబేధాలు వచ్చి విడిపోయారు.

పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆయన నటించిన పలు సినిమాలకు పని చేసింది రేణు దేశాయ్.

Telugu Krishna Vamshi, Mahesh Babu, Murari, Pawan Kalyan, Renu Desai, Sonali Bin

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి చివరిసారిగా ‘జానీ’ చిత్రం లో నటించింది.మళ్ళీ ఆమె ఇప్పటి వరకు ఎలాంటి సినిమా చెయ్యలేదు, చాలా కాలం తర్వాత ఆమె లేటెస్ట్ గా మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు'( Tiger Nageswara Rao ) చిత్రం లో ఒక ముఖ్య పాత్ర ద్వారా మన ముందుకి వస్తుంది.ఈ సినిమా ఈ నెల 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ కి ‘బద్రి’ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి.కానీ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన తర్వాత ఇక నటించకూడదు అని ఫిక్స్ అయ్యింది.

అలా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే ఛాన్స్ కూడా వదులుకుంది.మహేష్ బాబు కెరీర్ లో ‘మురారి'( Murari ) చిత్రం కి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆయన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నా, మురారి చిత్రం కి ఉన్న ప్రత్యేకత వేరు.

Telugu Krishna Vamshi, Mahesh Babu, Murari, Pawan Kalyan, Renu Desai, Sonali Bin

ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా రేణు దేశాయ్ ని సంప్రదించారట డైరెక్టర్ కృష్ణ వంశీ( Director Krishna Vamshi ).ఆమెకి మనసులో చెయ్యాలని ఉన్నప్పటికీ కూడా, ఇక సినిమాలు చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకుంది కాబట్టి నో చెప్పి పంపేసిందట.ఆ తర్వాత హిందీ నుండి సోనాలి బ్రిందే( Sonali Bindre ) ని ఈ సినిమా కోసం తీసుకున్నారు.

కేవలం ఈ చిత్రం మాత్రమే కాదు, ఎన్నో మంచి అవకాశాలను ఆమె అప్పట్లో వదులుకుందట.ఒకవేళ రేణు దేశాయ్ అలాగే హీరోయిన్ గా కొనసాగి ఉంటే ఈరోజు ఆమె రేంజ్ మరోలా ఉండేదని అంటున్నారు.

ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.ఇక నుండి ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube