అమెరికాకు ఉగ్రవాద శక్తుల నుంచి ముప్పు పొంచి వుందని ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్ధ ఎఫ్‌బీఐ చీఫ్( FBI chief ) హెచ్చరించారు.ప్రత్యేకించి ఇజ్రాయెల్ – పాలస్తీనా( Israel – Palestine ) వివాదం నుంచి ప్రేరణ పొందిన కొందరు అమెరికాపై విరుచుకుపడే అవకాశం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శాన్‌డియాగోలో జరిగిన ‘‘ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ ’’ వార్షిక సదస్సులో ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే( FBI Director Christopher Wray ) కీలక వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రాచ్యంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు అమెరికాపైనా తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.
యాంటిసెమిటిక్, ఇతర రకాల హింసాత్మక తీవ్రవాదానికి చరిత్ర సాక్షిగా వుందని క్రిస్టోఫర్ అన్నారు.ఇటీవలి సంఘటనల నుంచి ప్రేరణ పొంది హింసకు పాల్పడే వారిని ఓ కంట కనిపెట్టాలని ఆయన హెచ్చరించారు.

అయితే దేశీయ బెదిరింపుల గురించి ఎఫ్‌బీఐ చీఫ్ ఎలాంటి వివరాలను అందించలేదు.కాకపోతే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల వద్ద ఏవైనా వివరాలు వుంటే తప్పనిసరిగా పంచుకోవాలని, ఎఫ్‌బీఐ సైతం ఈ విషయంలో సహకరిస్తుందని క్రిస్టోఫర్ స్పష్టం చేశారు.అక్టోబర్ 13న ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ‘‘ జిహాద్ దినం ’’గా హమాస్ మాజీ లీడర్ ఖలీద్ మెషాల్( Khalid Meshaal ) ప్రకటించిన ఒక రోజు తర్వాత ఎఫ్‌బీఐ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యూఎస్ సహా అనేక పాశ్చాత్య దేశాలచే తీవ్రవాద సంస్థగా ప్రకటించబడిన హమాస్( Hamas ).అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మికదాడికి దిగిన సంగతి తెలిసిందే.స్థానిక అధికారుల కథనం ప్రకారం ఉగ్రదాడి తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో 1300 మందికిపైగా ఇజ్రాయెల్, 2400 మంది పాలస్తీనియన్లు మరణించారు.
మరణించినవారిలో 29 మంది అమెరికన్లు వుండగా, మరో 15 మంది ఆచూకీ తెలియరాలేదు.వీరిలో కొందరు హమాస్ చెరలో బందీలుగా వుండొచ్చని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
ఉగ్రవాద దాడుల నుంచి తనను తాను రక్షించుకుంటున్న ఇజ్రాయెల్‌కు బైడెన్ యంత్రాంగం తన మద్ధతును ప్రకటించింది.ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా దానిని సమర్ధించేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత వారం పేర్కొన్నారు.







