సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం.. రాధేశ్యామ్ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ సినీ కెరీర్ లో అత్యంత భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాలలో రాధేశ్యామ్( Radhe Shyam ) ఒకటి.ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించి మెప్పించారు.

 Actress Bhagyasree Comments About Industry Situations Details Here Goes Viral I-TeluguStop.com

మైనే ప్యార్ కియా సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన భాగ్యశ్రీ తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను సొంతం చేసుకోవడంతో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ ఈ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood )లో పని చేసేవాళ్లు మంచి వ్యక్తులు కాదని ప్రజలు భావిస్తారని భాగ్యశ్రీ( Bhagyashree ) అన్నారు.వాళ్ల అభిప్రాయాల కారణంగా అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మాత్రం ఇబ్బంది ఉంటుందని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ కు చెందిన వాళ్లు మంచి వ్యక్తులు అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలని ఆమె తెలిపారు.వంట చేస్తున్నట్టు, ఇంటిని శుభ్రం చేస్తున్నట్టు పోస్ట్ చేసినా అంగీకరించరని భాగ్యశ్రీ పేర్కొన్నారు.

Telugu Bhagyasree, Bollywood, Radhe Shyam, Tollywood-Movie

అలాంటివి పోస్ట్ చేస్తే మీరు అవన్నీ చేయకూడదని ఇంట్లో చాలామంది ఉన్నారు కదా అని చెబుతారని భాగ్యశ్రీ అన్నారు.సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులే అని ప్రజలు మరింత రూడ్ గా మారినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని భాగ్యశ్రీ( Bhagyashree ) అన్నారు.నేను 80వ దశకంలో సినిమాల్లోకి వచ్చానని సినిమాల్లోకి ప్రవేశించినప్పుడే ప్రజల్లో ఇలాంటి భావం ఉందని ఆమె తెలిపారు.

Telugu Bhagyasree, Bollywood, Radhe Shyam, Tollywood-Movie

సినిమాలు చాలా చెడ్డ ప్రపంచం అని మంచి కుటుంబం నుంచి వచ్చిన ఏ వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలోకి రానివ్వరని చాలామంది భావిస్తారని భాగ్యశ్రీ పేర్కొన్నారు.30 ఏళ్ల క్రితమే చాలామందిలో ఇలాంటి అభిప్రాయాలను చూశామని ఆమె తెలిపారు.ప్రస్తుతం ప్రతి రంగంలోనూ మహిళలు ఉన్నారని భాగ్యశ్రీ తెలిపారు.

భాగ్యశ్రీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube