హమాస్ చేసిన మెరుపుదాడి నుంచి ఇజ్రాయెల్( Israel ) తేరుకుని వెంటనే యుద్ధభేరి మోగించడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.పసిపిల్లలను, మహిళలను, వృద్ధులను అత్యంత క్రూరంగా చంపిన హమాస్‌ను ఈ భూమ్మీద లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ( Israel PM Benjamin Netanyahu ) భీషణ ప్రతిజ్ఞ చేశారు.
నాటి నుంచి ఇజ్రాయెడ్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) .గాజాపై భీకరదాడులు చేస్తోంది.
ఈ యుద్ధం కారణంగా వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ హెచ్చరించింది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచం రెండుగా చీలిపోయింది.ఇజ్రాయెల్‌కు కొన్ని, పాలస్తీనాకు( Palestine ) కొన్ని దేశాలు మద్ధతు ప్రకటించాయి.
స్వతహాగా అరబ్ దేశాలన్నీ పాలస్తీనా వైపు వుండగా.మరికొన్ని తటస్థంగా వున్నాయి.
భారతదేశం మాత్రం మరో మాట లేకుండా తమ మద్ధతు ఇజ్రాయెల్‌కే అని చెప్పింది.అగ్రరాజ్యం అమెరికా( America ) అయితే ఇజ్రాయెల్‌కు కావాల్సిన ఆర్ధిక, సైనిక సాయం అందజేస్తోంది.

ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో( Russia Ukraine War ) ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా సాయం చేస్తోంది.పెద్దన్న సాయంతోనే ఉక్రెయిన్‌ను మాస్కో సేనల్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతోంది.అయితే ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంపై అమెరికాలో భిన్నవాదనలు వున్నాయి.ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఇజ్రాయెల్ చేరడంతో అమెరికన్ల ఆలోచనా సరళి ఎలా వుందన్న దానిపై ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది.
పాలస్తీనా కేంద్రంగా నడుస్తోన్న హమాస్ మిలిటెంట్ గ్రూప్( Hamas ) చేసిన దాడికి .ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్య సమర్ధనీయమని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్ఎన్ చేసిన సర్వేలో తేలింది.

సర్వే ప్రకారం.50 శాతం మంది అమెరికన్లు ఇజ్రాయెల్ సైనిక చర్యను సమర్ధించారు.20 శాతం మంది పాక్షికంగా, కేవలం 8 శాతం మంది మాత్రం దీనిని వ్యతిరేకించారు.బైడెన్( President Joe Biden ) స్పందించిన తీరుపై 47 శాతం మంది అమెరికన్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో బైడెన్ యంత్రాంగానికి లభించిన మద్ధతు కంటే ఎక్కువ.అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడులపై ఇజ్రాయెల్ ప్రజల పట్ల 71 శాతం మంది అమెరికన్లు సానుభూతి తెలిపారు.96 శాతం మంది పాక్షికంగానైనా సానుభూతి ప్రకటించారు.దాదాపు 84 శాతం మంది అమెరికన్లు యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ , పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సానుభూతిని వ్యక్తం చేశారు.
రాజకీయపరంగా చూస్తే.రిపబ్లికన్లు 45 శాతం, స్వతంత్రులు 45 శాతం, డెమొక్రాట్లు 38 శాతం మంది ఇజ్రాయెల్ చర్యను సమర్ధించారు.
వయసురీత్యా చూసినా వృద్ధ అమెరికన్లు ఇజ్రాయెల్‌ను పూర్తిగా సమర్ధిస్తున్నారు.







