సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కేవలం 10 శాతం అనే సంగతి తెలిసిందే.ఎంతో కష్టపడితే మాత్రమే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాను ప్రేమించే అతికొద్ది మంది నిర్మాతలలో అనిల్ సుంకర( Producer Anil Sunkara ) ఒకరు.ఈ నిర్మాత నిర్మించిన ఏజెంట్, భోళా శంకర్ సినిమాలు మూడు నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయి.
ఈ రెండు సినిమాలు నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాయి.

ఏజెంట్ మూవీ( Agent Movie ) ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.ఏజెంట్, భోళా శంకర్ గాయాలు మానలేదంటూ అనిల్ సుంకర సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్ల ద్వారా అర్థమవుతుంది.ఖరీదైన తప్పులు చేశామంటూ అనిల్ సుంకర ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
అనిల్ సుంకర నిర్మాతగా సందీప్ కిషన్( Sundeep Kishan ) హీరోగా తెరకెక్కుతున్న ఊరు పేరు భైరవ కోన సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
సందీప్ కిషన్ వరుస ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్ వేయడంతో పాటు నిర్మాతగా అనిల్ సుంకరకు ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ లభిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అనిల్ సుంకర ట్వీట్ లో భవిష్యత్తు సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఊరు పేరు భైరవకోన సినిమా( Ooru Peru Bhairavakona ) విజువల్ ఎఫెక్స్ట్ పనులు పూర్తైన వెంటనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రకటన చేస్తామని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.భారీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని నమ్మకంతో ఉన్నామని సెకండ్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుందని అనిల్ సుంకర అన్నారు.వీఐ ఆనంద్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.అనిల్ సుంకర నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుందేమో చూడాల్సి ఉంది.







