స్టార్ హీరోయిన్ సాయిపల్లవి( Saipallavi ) యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవ్వని తెలుగు అభిమానులు ఉండరు.ఎలాంటి రోల్ లో నటించినా పూర్తిస్థాయిలో న్యాయం చేసే సాయిపల్లవి ఇతర భాషలతో పోల్చి చూస్తే తెలుగు సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
సాధారణంగా సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే రెమ్యునరేషన్ ను తిరిగివ్వడానికి హీరోయిన్లు ఆసక్తి చూపరు.ఈ విషయంలో సాయిపల్లవి సైతం గ్రేట్ అనే చెప్పాలి.
తన సినిమాలు ఫ్లాప్ అయితే సాయిపల్లవి రెమ్యునరేషన్ తిరిగిచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి.సహజనటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ప్రస్తుతం సినిమాలకు కొంతమేర గ్యాప్ తీసుకున్నారు. రామాయణం సినిమాలో సీత పాత్రలో సాయిపల్లవి ( Saipallavi )నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.నితీష్ తివారి ( Nitesh Tiwari )డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా గురించి సాయిపల్లవి ( Saipallavi )తొలిసారి స్పందించారు.ఈ ఆఫర్ నన్ను వరించిన అరుదైన అదృష్టం అని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సినిమా షూటింగ్ కు ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సాయిపల్లవి అన్నారు.ఈ సినిమాలోని పాత్ర సవాల్ తో కూడిన పాత్ర అని ఎందరో ప్రఖ్యాత నటీమణులు సీత పాత్రలో నటించారని సాయిపల్లవి తెలిపారు.
వారు చేసిన దానిలో 10 శాతం చేసినా చాలని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కథ వినడానికి త్వరలో ముంబై వెళ్తున్నానని ఆమె తెలిపారు.వాల్మీకీ రామాయణంను సంపూర్ణంగా తెరపై ఆవిష్కరించలేదని తమ రామాయణం తీరుస్తుందని సాయిపల్లవి( Saipallavi ) పేర్కొన్నారు.ఈ రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.
సాయిపల్లవి నటించడం వల్ల తెలుగులో కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారక ప్రకటన రానుంది.







