జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన కేసీఆర్ !

బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు,  జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు.2019 ఎన్నికలకు ముందు నుంచి జగన్ కెసిఆర్ మధ్య సహిత సంబంధాలు ఉన్నాయి.అనేక సందర్భాల్లో కేసీఆర్ జగన్ ( CM kcr CM jagan )ప్రత్యేకంగా భేటీ కావడం , ఏపీ తెలంగాణ విభజనకు సంబంధించిన అంశాలపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరిగాయి.2019 ఎన్నికల్లో వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడానికి పరోక్షంగా కేసీఆర్ సహకారం అందిందారు అనే ప్రచారం అప్పట్లో  జరిగింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం మధ్య ఇదే రకమైన స్నేహ సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.

 Kcr Showered Compliments On Jagan , Telangana Cm Kcr, Ap Cm Jagan, Brs P-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Ap, Ap Scheme, Brs Manifesto, Jagan, Telangana-Politics

తాజాగా ఏపీలో అమలవుతున్న పెన్షన్ పథకం పై కెసిఆర్ ( CM kcr )ప్రశంసలు కురిపించారు.ఏపీలో పెన్షన్ స్కీమ్ చాలా విజయవంతంగా జరుగుతోందని కేసీఆర్ కొనియాడారు .ప్రతి ఏడాది పెన్షన్ పెంచుకుంటూ వెళ్లే విధానం ఏపీలో చాలా అద్భుతంగా అమలవుతుందని అన్నారు.  అదే తరహా విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నట్లు కేసిఆర్ ప్రకటించారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్,ఈ  సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అనేక పథకాలను చేర్చుతున్నట్లు తెలిపారు.

Telugu Ap Cm Jagan, Ap, Ap Scheme, Brs Manifesto, Jagan, Telangana-Politics

ప్రతి ఏడాది పెన్షన్ పద్ధతిని అవలంబించాలనేది కూడా మేనిఫెస్టోలో పెడుతున్నట్లు వివరించారు.ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్న పెన్షన్ విధానం పై కేసీఆర్ >( CM kcr )ప్రశంసలు కురిపించారు.జగన్ ( CM jagan )పాలనలో ఏపీలో విజయవంతమైన ‘ ప్రతి ఏడాది పెన్షన్ పెంపు’ తెలంగాణలో కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ ప్రకటించారు.

కెసిఆర్ ఈ విధంగా తమ అధినేత జగన్ పై ప్రశంసలు కురిపించడం వైసిపి శ్రేణులు ఆనంద నువ్వు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కెసిఆర్ వ్యాఖ్యలను హైలెట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube