స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం జైలు అధికారులు చంద్రబాబు హెల్త్ బులిటెన్( Chandrababu Health bulletin ) విడుదల చేశారు.
ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని స్పష్టం చేశారు.ఇదే సమయంలో ఏసీబీ కోర్టు ఆదేశాలు మేరకు ఆయన ఉన్న బ్యారక్ లో ఏసీ ఏర్పాటు చేసినట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది.
చంద్రబాబు బీపీ 140/80, పల్స్ 70/నిమిషం, రెస్పిరేటరి రేటు: 12/నిమిషం అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుందని బులిటెన్ లో వైద్యులు స్పష్టం చేశారు.
మరో పక్క జైల్లో చంద్రబాబు( Chandrababu naidu ) ప్రాణానికి హాని ఉందని తెలుగుదేశం నాయకులు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబుకి జైల్లో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వైసీపీ ప్రభుత్వమే వహించాలని హెచ్చరికలు చేస్తున్నారు.73 సంవత్సరాలు వయసు కలిగిన చంద్రబాబు అరెస్ట్ అయి దాదాపు 30 రోజులకు పైగా జైల్లో ఉంటూ వస్తున్నారు.కొద్ది రోజుల క్రితం డిహైడ్రేషన్ గురి కావటం తర్వాత స్కిన్ ఎలర్జీ( Skin allergy ) రావటంతో కుటుంబ సభ్యులు మరియు టీడీపీ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు.







