సాధారణంగా ప్రేక్షకులు ఒక సినిమాని చూడాలి అంటే ఆ సినిమాకు వచ్చే టాక్ ఆధారంగా థియేటర్లకు వెళ్లి సినిమాలను చూస్తుంటారు.ఒకవేళ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది అంటే ఆ సినిమా వైపు కూడా కన్నెత్తి చూడరు.
ఇక ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందడంతో సినిమాలన్నీ కూడా కొద్ది రోజులలోనే సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటాయి ఈ క్రమంలోనే హెచ్డి వర్షన్ లో కూడా ఫ్లాప్ సినిమాలు లీక్ అయినప్పటికీ ఆ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవడం గమనార్హం.ఇలా ఇప్పటికే రెండు ఫ్లాప్ సినిమాలు హెచ్డి వర్షన్ లో లీక్ అయ్యి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నా కూడా వాటిని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు.

ఇలా హెచ్డి వర్షన్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులు చూడనటువంటి ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే నయనతార జయం రవి వంటి వారు ప్రధాన పాత్రలలో నటించినా గాడ్ సినిమా( God Movie ) ఫ్లాప్ టాక్ సొంతం చేసుకొని హెచ్డి వర్షన్ లో సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ ఈ సినిమాని ప్రేక్షకులు చూడకపోవటం విడ్డూరంగా ఉందని చెప్పాలి.ఇక ఈ సినిమా సంగతి అటు ఉంచి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంగా చంద్రముఖి 2( Chandramkhi 2 )సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈ సినిమా విడుదల అయ్యి భారీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమాలో లారెన్స్ ( Lawrence ) కంగనా వంటి సెలబ్రిటీలు నటించిన పెద్దగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా హెచ్డి వెర్షన్లో( Chandramkhi 2 HD Version ) సోషల్ మీడియాలో అందుబాటులో ఉందని తెలిసినప్పటికీ ఈ సినిమాని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడటం లేదు.ఇలా ఒకసారి ఫ్లాప్ వచ్చింది అంటే ఆ సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం చూడటం లేదని ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఇదివరకే ఇలాంటి టాక్ సొంతం చేసుకున్న సినిమాల పరిస్థితి మొత్తం ఇలాగే ఉందని చెప్పాలి.త్వరలోనే ఈ సినిమాలు నెట్ ఫ్లిక్స్( Netflix ) లో ప్రసారం కాబోతున్నాయి.
మరి అక్కడైనా ప్రేక్షకులు ఈ సినిమాలను ఆదరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.చంద్రముఖి 2 సమయంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై అంచనాలను పెంచినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి.







