తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.ఈ మేరకు మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ మొదటి జాబితాలో 55 మంది పేర్లను ప్రకటించింది.
అయితే 70 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేని 55 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఈనెల 25వ తేదీ లోపు ప్రకటించే యోచనలో ఉంది.
కాగా ఈ ఫస్ట్ లిస్టులో బెల్లంపల్లి నియోజకవర్గానికి గడ్డం వినోద్, మంచిర్యాల -ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్ -శ్రీహరి రావు, ఆర్మూర్ -వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ – సుదర్శన్ రెడ్డి, బాల్కొండ -సునీల్ కుమార్ ముత్యాల, జగిత్యాల – టి జీవన్ రెడ్డి, ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం – ఎం ఎస్ రాజ్ ఠాకూర్, మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి -విజయ రమణరావు, వేములవాడ – ఆది శ్రీనివాస్, మానకొండూర్ – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు, అందోల్ – దామోదర రాజనర్సింహా, జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్, సంగారెడ్డి – జగ్గారెడ్డి, గజ్వేల్ – నర్సారెడ్డి, మేడ్చల్ – తోటకూర వజ్రేశ్ యాదవ్, మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు, కుత్బుల్లాపూర్ – కొలను హన్మంత్ రెడ్డి, ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి, చేవెళ్ల – పమెన భీం భరత్, పరిగి – రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ – గడ్డం ప్రసాదకుమార్, ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్, మలక్ పేట్ – షేక్ అక్బర్, సనత్ నగర్ – డాక్టర్ కోట నీలిమా, నాంపల్లి – మహ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ – ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ, గోషామహల్ – మొగిలి సునీత, చాంద్రాయణ గుట్ట – బోయ నగేశ్, యాకుత్ పురా – కే రవిరాజు, బహదూర్ పురా – రాజేశ్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్ – సంతోష్ కుమార్, గద్వాల్ -సరిత తిరుపతయ్య, అలంపూర్ -డాక్టర్ సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ – కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, అచ్చంపేట – డా చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి, షాద్ నగర్ – శంకరయ్య, కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు, నాగార్జునసాగర్ -జయవీర్ కుందూరు, హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ – పద్మావతి రెడ్డి, నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ – వేముల వీరేశం, ఆలేరు – బీర్ల ఐలయ్య, స్టేషన్ ఘన్ పూర్ – సింగాపురం ఇందిర, నర్సంపేట -దొంతి మాధవరెడ్డి, కొడంగల్ – రేవంత్ రెడ్డి, భూపాలపల్లి -గండ్ర సత్యనారాయణరావు, ములుగు – సీతక్క, మధిర – భట్టి విక్రమార్క, భద్రాచలం – పొడెం వీరయ్య పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.