డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) పటాస్ సినిమా(Patas Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా మొదటి సినిమానే ఎంతో మంచి విజయం కావడంతో తదుపరి ఈయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమాలో బాలకృష్ణ కాజల్ అగర్వాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించారు.
ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.అయితే ఈ సినిమాకు మొదట్లో బ్రో ఐ డోంట్ కేర్ (Bro I Dont Care) అనే టైటిల్ అనుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ టైటిల్ పెట్టబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
మరి ఈ టైటిల్ ఎందుకని పెట్టలేదు అంటూ అనిల్ రావిపూడికి ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ మొదట్లో ఇదే టైటిల్ అనుకున్నాము కాకపోతే ఈ సినిమా టైటిల్ చాలా ఫోర్స్ గా పవర్ ఫుల్ గా ఉండాలని భావించాము.
టైటిల్ పెడితే కొన్ని రోజులపాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమాతో ట్రావెల్ అవ్వాలని భావించాము .ఇప్పుడు ఒక సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటాయి.

ఈ విధంగా మా సినిమాకి కూడా అలాంటి గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో ఈ సినిమాకు భగవంత్ కేసరి అని పెట్టాం, దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్బీకే గా కాయిన్ చేయడంతో ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచిందని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తెలియజేశారు.ఇక షూటింగ్ లొకేషన్లో మిమ్మల్ని బాలక్రిష్ణ గారు ఏమని పిలుస్తారు అనే ప్రశ్న కూడా ఈయనకి ఎదురు కావడంతో ఆయన నన్ను బ్రో అని పిలుస్తారు.షూటింగ్ స్పాట్ లో ఉంటే గురువుగారు అని పిలుస్తారు.అలాంటి ఒక సీనియర్ లెజెండరీ యాక్టర్ నన్ను గురువుగారు అని పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని, దర్శకుడు స్థానానికి బాలకృష్ణ గారు ఇచ్చే గౌరవం అదేనని తెలిపారు.
ఇక ఆయన ఫన్ మూడ్లో ఉంటే తనని ఆపడం ఎవరి తరం కాదని అన్ స్టాపబుల్ అంతే అంటూ ఈ సందర్భంగా అనిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







