వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.ఈ క్రమంలోనే మహిళలు( Women Health Problems ) అనేక హెల్త్ ఇష్యూస్‌ను ఫేస్ చేస్తూ ఉంటారు.
వయసు పైబడే కొద్ది మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెనోపాజ్, గర్భాశయ వ్యాధులు, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి తలెత్తే అవకాశాలు పెరగుతూ ఉంటాయి.వీటన్నిటినికి దూరంగా ఉంటూ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ను లీడ్ చేయాలంటే మహిళలు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే 8 రకాల పోషకాలను తీసుకోవాల్సి ఉంది.
మరి లేటెందుకు ఆ 8 రకాల పోషకాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

మహిళలు నిత్యం తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం( Calcium ) ఒకటి.వయసు పెరిగే కొద్దీ మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అందుకే కాల్షియం రిచ్ గా ఉండే పాలు, పెరుగు, జున్ను, పన్నీర్ వంటివి తీసుకోండి.
దృఢమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణకు కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఫోలేట్( Folate ). దీనినే ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి9 అని పిలుస్తుంటారు.మహిళలు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన పోషకం ఇది.గుండె ఆరోగ్యం, నరాల పనితీరు, కంటి చూపు, రక్త ప్రసరణ మరియు శక్తి ఉత్పత్తిని మెరుగుపరచడంలో ఫోలేట్ సహాయపడుతుంది.అలాగే గర్భధారణ సమయంలో శిశువు పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది.
చిక్కుళ్ళు, తృణధాన్యాలు, ఆకుకూరలు, సిట్రస్ పండ్ల ద్వారా ఫోలేట్ పొందొచ్చు.

ఐరన్( Iron ) మహిళ ఆరోగ్యానికి చాలా అవసరమైన పోషకం.మహిళల్లో రక్తహీనతను నివారించడాని ఐరన్ ముఖ్యపాత్రను పోషిస్తుంది.పాలకూర,చిలగడదుంపలు, బటానీలు, బ్రోకలీ, ఫిష్, గుమ్మడి గింజలు, మీట్ వంటి ఫుడ్స్ లో ఐరన్ దొరుకుంది.
అలాగే మహిళలు నిత్యం ఖచ్చితంగా తీసుకోవాల్సిన పోషకాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్( Omega 3 Fatty Acids ) ఒకటి.గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది.
నెయ్యి, అవకాడో, వాల్‌నట్స్, చియా గింజలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాల ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను పొందవచ్చు.విటమిన్ డి కాల్షియం శోషణ, రోగనిరోధక పనితీరు మరియు మొత్తం ఆరోగ్యానికి అవసరం.
ఇది స్త్రీ శరీరంలో హార్మోన్‌గా పనిచేస్తుంది. విటమిన్ డి పొందడానికి ఉదయం సూర్యుని క్రింద కొంత సమయం గడపవచ్చు.
ఇక వీటితో పాటు ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, పోటాషియం వంటి పోషకాలను కూడా మహిళలు తీసుకోవాలి.







