రాజన్న సిరిసిల్ల జిల్లా :టిపిసిసి మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు శ్రేణులు ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దగ్ధం చేశారు.ఈ సందర్భంగా మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ మాట్లాడుతూ టిపిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అనుభవంలో వయసు లేని బ్రోకర్ రేవంత్ రెడ్డి విఛ్ఛలవిడిగా మాట్లాడడం అవివేకమని వెంటనే రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే అయనను రాష్ట్రంలో తిరగనివ్వమని వారు హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సోదరులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం ప్రతినిధి వరుస కృష్ణ హరి మాట్లాడుతూ మాజీ టిపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడు బ్రోకర్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బాధ రమేష్ , ఎంపిటీసీ సభ్యులు ఉప్పుల మల్లేశం,సింగిల్ విండో ఉపాధ్యక్షులు జంగిడి సత్తయ్య,ఎ ఏం సి డైరెక్టర్ మేడిశెట్టి శ్రీనివాస్ , ఏఎంసీ మాజీ డైరెక్టర్ సిరిపురం రాజిరెడ్డి , మున్నూరుకాపు సంఘం మండల ఉపాధ్యక్షులు తడకల దేవరాజు , మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు ఉప్పుల రాజిరెడ్డి , బండారి బాల్ రెడ్డి, మీసం రాజ్యం , తడకల ప్రభాకర్ , దేవయ్య, , గుండం ఎల్లం, సకినాల వెంకటయ్య , పోస్టు లక్ష్మీనరసయ్య, అనిల్ , జవ్వాజీ రామస్వామి, ఉప్పుల సత్తయ్య , కర్ల శేఖర్, మేడిశెట్టి మల్లేశం , తదితరులు పాల్గొన్నారు







