కేసీఆర్ ఈసారి పోటీచేయబోయే రెండు స్థానాల్లో ఓడిపోబోతున్నాడా..? సంచలనం రేపుతున్న సర్వే!

వచ్చే నెలలో తెలంగాణ ( Telangana )ప్రాంతం లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఎన్నికలలో జనసేన పార్టీ ( Janasena party )మినహా, ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన ఏ పార్టీ కూడా పోటీ చెయ్యడం లేదు.

 Is Kcr Going To Lose In The Two Seats He Will Contest This Time Sensational Surv-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ జరగబోతుంది.ఉప ఎన్నికలలో మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో గెలిచి సత్తా చాటిన బీజేపీ పార్టీ ( BJP party )మాత్రం ఈసారి బాగా వెనకబడింది అని చెప్పొచ్చు.

ఈ పార్టీ కి తెలంగాణ లో మూడవ స్థానమే దక్కనుంది అని సమాచారం.ఇక షర్మిలా వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చీల్చబోయ్యే ఓట్లు ఏ పార్టీ కి నష్టం తెస్తుందో చూడాలి.

జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తుండగా, షర్మిల వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ 117 స్థానాల్లో పోటీ చేయబోతుంది.

Telugu Kcr, Janasena, Telangana-Telugu Political News

ఇదంతా పక్కన పెడితే ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ( Chief Minister KCR )పోటీ చెయ్యబొయ్యే రెండు స్థానాలు ఓడిపోబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.గతం లో ఆయన గజ్వెల్ మరియు కామారెడ్డి నియోజకవర్గాల నుండి పోటీ చేసి రికార్డు స్థాయి మెజారిటీ తో గెలిచాడు.ఈసారి కూడా ఆ రెండు స్థానాల నుండే పోటీ చెయ్యబోతున్నాడు.

కానీ ఆ రెండు స్థానాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సేఫ్ కాదని సర్వేలు చెప్తున్నాయి.ఎందుకంటే ఆయన సొంత సామాజిక వర్గం ముదిరాజ్ ఓట్లు 50 వేలకు పైగా చీలిక ఉండే అవకాశం ఉండడం.

ఇదే కేసీఆర్ ఓటమికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.అదే కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చినా కూడా నిరాశ తప్పదు.

మరి కేసీఆర్ తానూ పోటీ చెయ్యబొయ్యే స్థానాలను మార్చుకుంటాడా లేదా అనేది చూడాలి.

Telugu Kcr, Janasena, Telangana-Telugu Political News

గజ్వేల్ నియోజగవర్గం( Gajwel Constituency ) కి కేసీఆర్ కి నువ్వే నేనా అనే రేంజ్ లో పోటీ ఇవ్వబోతున్నాడు అట ఈటెల రాజేంద్రప్రసాద్.కేసీఆర్ ని ఎలా అయిన ఓడించాలి అనే కసితో ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాడట.ఇక కామారెడ్డి స్థానం కేసీఆర్ కి మరింత క్లిష్టమైన స్థానం అనే చెప్పాలి.

ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అరవింద్, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ ఇద్దరు కూడా కేసీఆర్ కి పోటీని ఇవ్వబోతున్నారు.ఈ త్రికోణపు పోటీ లో కేసీఆర్ గెలుపు అంత తేలికేమి కాదు.

మరి కేసీఆర్ ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులను ఎలా ఎదురుకొని తన స్థానాల్లో విజయం సాధిస్తాడు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube