లియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర అన్ని వేలా.. ఈ టికెట్ రేట్లు మరీ ఘోరమంటూ?

యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ ( Lokesh Kanagaraj ) – హీరో విజయ్‌ ( Vijay ) కాంబినేషన్‌లో రానున్న ‘లియో’ ( Leo ) చిత్రం.ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ 12వ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Vijay Leo Movie First Day First Show Cost Will Shock You Details Inside , Vijay,-TeluguStop.com

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు.తమిళనాడులోని పలు ప్రధాన నగరాలలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.

అయితే లియో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం కోసం టికెట్లు కొనుగోలు చేసేవాళ్ళు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది.అభిమాన హీరోల సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం కోసం ఎంతో మంది అభిమానులు ఆరాటపడుతుంటారు.

Telugu Kollywood, Leo, Leo Day, Trisha, Vijay-Movie

ఇదే విషయాన్ని తమకు అనుగుణంగా చేసుకొని భారీ స్థాయిలో టికెట్ ధరలను విక్రయిస్తున్నారని తెలుస్తుంది.సినిమా మొదటిరోజు ఫస్ట్ షో చూడాలి అంటే ఒక్కో టికెట్ కు దాదాపు 3,000 నుంచి 5000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.దీంతో దీంతో FDFS అనే ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.చెన్నై, కోయంబత్తూరు, మదురై( Chennai, Coimbatore, Madurai ) వంటి నగరాల్లో ఈ ధరలు భారీగా ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు పలుకుతోందని ఫ్యాన్స్ పేర్కొన్నారు.

Telugu Kollywood, Leo, Leo Day, Trisha, Vijay-Movie

ఫ్యాన్స్‌ షో పేరుతో పలు సినిమా థియేటర్లు, అభిమాన సంఘాల పేరుతో ఇలా భారీ స్థాయిలో డబ్బులను వసూలు చేస్తున్నారని ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో టికెట్లను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు అంటూ కొందరు అభిమానులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి షోలను ఎవరు కూడా ప్రోత్సహించకూడదని ఇలాంటి షోల కారణంగా ఎంతో మంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని 19 నుంచి 24వ తేదీ వరకు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే.

లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ నటించిన మాస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో భారీగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube