చిరంజీవి చిన్న కూతురు శ్రీజ( Sreeja Konidela ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా శ్రీజ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు.
శ్రీజ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది.శ్రీజ మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని ఆ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం గురించి స్పందించడానికి శ్రీజ ఏ మాత్రం ఇష్టపడటం లేదు.
హ్యాపీ బర్త్ డే మై లవ్ రచన పాలకుర్తి( Rachana Palakurthi ) అనే క్యాప్షన్ తో శ్రీజ ఆమెకు ముద్దులు పెడుతూ ఉన్న ఫోటోను షేర్ చేశారు.శ్రీజ క్లోజ్ ఫ్రెండ్స్ లో రచన కూడా ఒకరని తెలుస్తోంది.
రచనకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలోనే ఉంది.ఆర్టిస్ట్ గా, ఇంటీరియర్ డిజైనర్ గా, డిజైన్ రీసెర్చర్ గా ఆమె పాపులారిటీని పెంచుకున్నారు.2017 సంవత్సరం నుంచి రచన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్నారు.

చిరంజీవికి( Chiranjeevi ) శ్రీజ అంటే ఎంతో ప్రేమ అని కూతురిపై ప్రేమతో మెగాస్టార్ ఇప్పటికే కొన్ని స్థలాలను కొనుగోలు చేసి శ్రీజ పేరిట రిజిష్ట్రేషన్ చేయించారని తెలుస్తోంది.శ్రీజ పోస్ట్ లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.శ్రీజ సినిమా రంగానికి దూరంగా ఉన్నారు.
శ్రీజ సోదరి సుస్మిత ఇప్పటికే నిర్మాతగా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

చిరంజీవి విషయానికి వస్తే చిరంజీవి త్వరలో వశిష్ట( Vashisth ) సినిమాతో బిజీ కానున్నారు.ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.చిరంజీవి సినిమాలన్నీ భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కుతోందని తెలుస్తోంది.







