సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారి గురించి తరచూ వార్తలు వస్తూ ఉంటాయి.సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల గురించి రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాము.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి కూడా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఒక యంగ్ హీరో కెరియర్ నాశనం అవ్వడానికి చిరంజీవిని కారణం అంటూ ఎన్నో రకాల వార్తలో వచ్చాయి అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చిరంజీవితో పోటీగా నటిస్తున్నటువంటి హీరో సుమన్ ( Suman ) కెరియర్ కూడా నాశనం అవ్వడానికి చిరంజీవి కారణమంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
చిరంజీవి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి జర్నలిస్టులు రాసే వార్తల గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.జర్నలిస్టులు( Journalist ) కలానికి ఎంతో బలం ఉందని అయితే వారు ఎప్పుడు కూడా మంచి వార్తలు నిజా నిజాలు రాస్తే బాగుంటుందని ఈయన కామెంట్ చేశారు మొన్నటికి మొన్న మన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలి అంటే ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని అలా చేయించుకుంటే ఏ సమస్య ఉండదు అంటూ నేను చెప్పాను.
జర్నలిస్టులు నేను ఆ సమస్యతో బాధపడ్డాను ట్రీట్మెంట్ చేయించుకున్నాను అంటూ ఒక వార్త తప్పుగా రాయడంతో ఎంతోమంది కంగారు పడుతూ నాకు ఫోన్లు చేయడం మెసేజ్లు చేయడం జరిగింది.ఇలా ఆ వార్తతో నేనొక్కడినే కాదు ఎంతోమంది అభిమానులు ఆవేదన చెందారు.ఇలాంటి తప్పుడు వార్తలను రాయకండి అంటూ చిరంజీవి తెలియజేశారు.తన గురించి ఈ తప్పుడు వార్త రావడంతో వెంటనే నేను స్పందించి సమాధానం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా జర్నలిస్టుల కలానికి ఎంతో బలం ఉంది కానీ దానిని మంచి పనులకు ఉపయోగించుకోవడం ముఖ్యమని తెలిపారు.
ఇక హీరో సుమన్ విషయం గురించి కూడా చిరంజీవి మాట్లాడారు.హీరో సుమన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చారు.అలాంటి సమయంలో ఈయన ఉన్నఫలంగా అరెస్టు అయ్యారు.
ఇలా సుమన్ జైలుకు వెళ్లడంతో అందుకు కారణం చిరంజీవి అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అప్పటినుంచి చిరంజీవికి సుమన్ కి మధ్య గొడవ జరుగుతూనే ఉందని ఇప్పటికి మాట్లాడుకోరంటు వార్తలు వచ్చాయి.
అయితే అందులో ఏమాత్రం నిజం లేదు అవన్నీ కూడా అవాస్తవాలేనని నేను సుమన్ ఇద్దరు కూడా ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఈ వార్తను ఇలాగే రిపీట్ చేస్తూ వస్తున్నారని చిరు ఆగ్రహం వ్యక్తం చేశారు.మొన్నటికి మొన్న సుమన్ పుట్టినరోజు సందర్భంగా నా ఫోన్ నుంచి నేనే స్వయంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేశాను.
అందుకు ఆయన థాంక్స్ అన్న థాంక్యూ సో మచ్ అంటూ నాకు రిప్లై ఇచ్చారని ఇలా మా ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు లేకపోయినా గొడవలు సృష్టిస్తున్నారు అంటూ చిరు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.