వడ్డె నవీన్( Vadde Naveen ) .ప్రముఖ నిర్మాత వడ్డె రమేష్ వారసుడిగా ఇండస్ట్రీకి కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వడడ్డె నవీన్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు.
ఆ తర్వాత వచ్చిన పెళ్లి సినిమా ( Pelli movie ) తో లవర్ బాయ్ ఇమేజ్ ని సంపాదించారు.ఇక అలాంటి వడ్డె నవీన్ సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.
దాదాపు 30 కి పైగా సినిమాల్లో చేసిన ఈయన ప్రస్తుతం ఫెడ్ అవుట్ అయిపోయారు.అంతేకాదు ఎక్కడా కూడా మీడియా ముందు కనిపించడం లేదు.
అయితే వడ్డె నవీన్ ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి తప్ప ఏది నిజమవడం లేదు.

ఇదంతా పక్కన పెడితే వడ్డె నవీన్ సీనియర్ ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరి ( Chamundeshwary ) పెళ్లి చేసుకున్నారు.అయితే ఈమెని పెళ్లి చేసుకునే కంటే ముందే నవీన్ మరో హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీదేవి కజిన్ సిస్టర్ అయిన మహేశ్వరి.
వడ్డే నవీన్ మహేశ్వరి కాంబినేషన్లో పెళ్లి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమా తర్వాత మహేశ్వరి తో కలిసి మా బాలాజీ అనే సినిమాలో కూడా నటించారు.

ఇక ఈ రెండు సినిమాల్లో నటించే సమయంలోనే మహేశ్వరి వడ్డె నవీన్ ( Maheshwari Vadde Naveen )ఇద్దరు ప్రేమలో పడిపోయి డేటింగ్ కూడా చేశారట.ఇలా సినిమాల్లో కొనసాగుతున్న సమయంలో వరుసగా నాలుగైదు ప్లాఫ్ లు రావడంతో ఆయన సినీ కెరియర్ కాస్త డిస్టర్బ్ అయింది.అంతేకాకుండా తండ్రి వడ్డె రమేష్ డబ్బు ఉంటే సరిపోదు సినీ బ్యాగ్రౌండ్ కూడా తన కొడుకుకి ఉండాలి అని సినిమాల్లో తనకి ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్ మనవరాలిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు.అలా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బంధుత్వంగా మలుచుకొని ఎన్టీఆర్ ( NTR ) మనవరాలిని వడ్డె నవీన్ పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరి పెళ్లయ్యాక కొన్నిఅభిప్రాయ బేధాలు రావడంతో కొన్ని సంవత్సరాలకే విడిపోయారు.అలా వడ్డే నవీన్ తండ్రి మాట కాదనలేక ప్రేమించిన హీరోయిన్ మహేశ్వరిని వదులుకొని చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఎక్కువ రోజులు వీరి సంసార జీవితం సాగలేదు.







