వీడియో: ఆటోమేటిక్ బస్సు డోర్‌లో ఇరుక్కున్న బాలుడు.. ఆపకుండా ముందుకు పోనిచ్చిన డ్రైవర్..

స్కూల్ బస్సు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే పిల్లలు కొన్నిసార్లు తెలియక బస్సు కింద పడటం, లేదంటే బస్సుకి అడ్డంగా రావడం, సరిగా దిగకపోవడం వంటి ప్రమాదాల్లో తరచూ పడుతుంటారు.

 Boy Stuck In Automatic Door Of School Bus Video Viral Details, Viral News, Lates-TeluguStop.com

అయితే బస్సు డ్రైవర్లు( Bus Driver ) ఒక్కోసారి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు.తమ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణానికి మూల్యం అవుతుందని వారు గ్రహించలేరు.

అయితే ఒక లేడీ డ్రైవర్( Lady Driver ) నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు ఎంత ఘోరం జరిగిందో చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయింది.ఈ వీడియోను ప్రముఖ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) అకౌంట్ అయిన @సీసీటీవీఇడియట్స్ షేర్ చేసింది.

ఆ వీడియో 95 లక్షలకు పైగా వ్యూస్ తో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వీడియో ఓపెన్ చేస్తే మనకు బస్సు నిండా కూర్చుని ఉన్న విద్యార్థులు( Students ) కనిపిస్తారు.అందులో ఒక పెద్ద వ్యక్తి కూడా ఉన్నాడు.డ్రైవర్ ఐగ్లాసెస్ పెట్టుకుని ఉంది.

స్టాప్ వచ్చేసరికి ఆమె బస్సు ఆపగా ఒక పిల్లోడు కిందికి దిగడానికి ప్రయత్నించాడు.ఆ స్టూడెంట్ కిందకి పూర్తిగా దిగకముందే ఈ లేడీ ఆటోమేటిక్ డోర్( Automatic Door ) క్లోజ్ అయ్యేలా బటన్ నొక్కింది.

దాంతో బాలుడి బ్యాగ్ డోర్ లోపలే చిక్కుకుపోయింది.బాలుడు మాత్రం బయటే ఉండిపోయాడు.

ఆ తర్వాత బస్సు స్టార్ట్ అయింది.బాలుడు బయట ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకోగా డ్రైవర్ చూసుకోలేదు.

ఆమె అంతే స్పీడ్ గా వెళ్తూ ఉంది.

అలా వెళ్తూ ఉంటే బాలుడు బస్సు డోర్‌కు వేలాడుతూ వచ్చాడు.బస్సు వేగంగా పోతుండగా రోడ్డుపై అతడి శరీరం రాసుకుంటూ ఉంది.చాలాసేపు దాకా డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించలేదు.

డ్రైవర్ ఒకరే కాదు బస్సులో( School Bus ) ఉన్న ఏ ఒక్కరు కూడా స్టూడెంట్‌ను చూడనే లేదు.చివరికి డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించే వెంటనే బస్సు ఆపేసింది.

సదరు స్టూడెంట్ కు ఎంత పెద్ద గాయాలయ్యాయో తెలియ రాలేదు కానీ ఇందులో డ్రైవర్ తప్పిదం కనిపిస్తోంది చాలామంది.ఆమెనే తిట్టిపోస్తున్నారు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube