అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్‌‌పై భారత సంతతి అభ్యర్ధి నిక్కీ హేలీ ఆధిక్యత , సంచలన సర్వే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ( Nikki Haley ) తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు.రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధుల రేసులో ఆమె ట్రంప్, డిసాంటిస్, వివేక్ రామస్వామి తర్వాత నిలిచారు.

 Us Presidential Election Indian-american Nikki Haley Beats Biden By 4 Points In-TeluguStop.com

తాజాగా ఎన్నికలకు సంబంధించి వచ్చిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిక్కీ హేలీ చేతిలో జో బైడెన్( Joe Biden ) ఓడిపోతారట.అలాగే ట్రంప్‌ను కూడా ఆమె తృటిలో అధిగమించవచ్చు.

బైడెన్ కంటే ట్రంప్ ఒక పాయింట్ ఆధిక్యంలో వున్నారు.కానీ నిక్కీ హేలీ కంటే ఆయన నాలుగు పాయింట్ల వెనుక వున్నారని ఫాక్స్ న్యూస్ సర్వే తెలిపింది.

Telugu Biden, Democrat, Donald Trump, Indian American, Nikki Haley, Joe Biden, R

అక్టోబర్ 6 నుంచి 9 మధ్య నిర్వహించిన ఈ పోల్‌లో నిక్కీ హేలీ లీడింగ్‌లో వున్నారని సర్వే వెల్లడించింది.డెమొక్రాట్‌ల నుంచి హేలీకి అత్యధిక మంది (9 శాతం) మద్ధతుగా నిలిచారు.ఇదే సమయంలో ట్రంప్‌కు (5 శాతం) మంది మాత్రమే మద్ధతు ఇస్తున్నారు.నిక్కీ హేలీకి అనుభవంతో పాటు ప్రస్తుతం దూకుడు మీద వున్నారని 2024 అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న మాజీ కాంగ్రెస్ సభ్యుడు విల్‌హర్డ్.

ఫోర్బ్స్‌తో అన్నారు.మరోవైపు .2024 అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections 2024 ) బైడెన్‌ను ఓడించగల ఏకైక రిపబ్లికన్ నిక్కీ హేలీ అని గత నెలలో సీఎన్ఎన్ పోల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.సీఎన్ఎన్ పోల్‌లో నిక్కీ హేలీకి 49 శాతం, బైడెన్‌కు 43 శాతం మంది మద్ధతుగా నిలిచారు.

Telugu Biden, Democrat, Donald Trump, Indian American, Nikki Haley, Joe Biden, R

చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ .మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అధ్యక్ష పోటీలో తన ఆధిక్యాన్ని కొనసాగించారని ఫాక్స్ న్యూస్ సర్వే తెలిపింది.ట్రంప్‌కు రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లలో 59 శాతం మంది మద్ధతు లభించింది.మార్చిలో 50 శాతానికి పైగా, సెప్టెంబర్‌లో 60 శాతానికి పైగా మంది ఆయనకు మద్ధతుగా నిలిచినట్లు సర్వే పేర్కొంది.ఆగస్టు చివరిలో జరిగిన తన తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్ తర్వాత హేలీ మాట్లాడుతూ.2024 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ పార్టీ నామినీగా వుండరని చెప్పారు.ఆ తర్వాత జరిగిన సెకండ్ రిపబ్లికన్ డిబేట్‌లో .చైనాపై ట్రంప్ విధానాలను హేలీ నిందించారు.అధ్యక్షుడిగా వున్నప్పుడు ఫెంటానిల్‌ను అమెరికాకు రవాణా చేయడంలో చైనా పాత్రపై ఆయన దృష్టి పెట్టలేదని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube