ఇండియాలో 5 లక్షల ట్విట్టర్(ఎక్స్) అకౌంట్స్ బ్యాన్?

ట్విట్టర్ ( X కార్ప్ ) అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) ఇండియన్ కస్టమర్లకు గురి పెట్టాడు.ఈ క్రమంలో ఇక్కడ లక్షల సంఖ్యలో అకౌంట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాడు.

 Elon Musk X Banned Over 5 Lakh Accounts For Policy Violations In India,elon Musk-TeluguStop.com

మనోడు ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం విదితమే.ట్విట్టర్ కొనుగోలు చేసిన మొదట్లో బ్లూ టిక్ మార్క్( Blue Tick Subscription ) కోసం సబ్ స్క్రిప్షన్ మొదలు పెట్టగా తర్వాత ఏకంగా ట్విట్టర్ ఖాతాదారులందరికి సబ్ స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసే కొత్త ప్రతిపాదనలు చేశారు.

ఇపుడు తాజాగా ఖాతాల తొలగింపు ప్రక్రియను స్టార్ట్ చేసింది.ఇప్పటికే జూన్, జూలై నెలల్లో లక్షల్లో ఖాతాదారులను తొలగించింది.

Telugu Elon Musk, India, Policy, Corp-Latest News - Telugu

ఈ నేపధ్యంలో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 26 మధ్య కాలంలో దాదాపు అర మిలియన్ అంటే 5.59లక్షల ఇండియన్ ఖాతాలను( Indian Twitter Accounts ) బ్యాన్ చేశారు.X కార్ప్ (గతంలో ట్విట్టర్) తొలగించిన ఖాతాల్లో చిన్న పిల్లల అశ్లీల దృశ్యాలకు సంబంధించిన, ప్రోత్సహించేవే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది.వీటితో పాటు టెర్రరిజాన్ని ప్రోత్సహించే 1675 ఖాతాలను కూడా తొలగించారట.

ఈ అకౌంట్లను భారతదేశపు కొత్త IT నిబంధనలకు( IT Rules ) అనుగుణంగా X కార్ప్ తొలగించిందని వినికిడి.కంటెంట్ ను తొలగించడం, నియంత్రించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలనుంచి X Corp కు భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయి.

వీటిలో ఇండియా నుంచి 3,076 ఫిర్యాదులు అందడం గమనార్హం.

Telugu Elon Musk, India, Policy, Corp-Latest News - Telugu

కాగా వీటిలో దాదాపు 83 శాతం ఫిర్యాదులను X కార్ప్ పరిష్కరించబడ్డాయి.2023 జూలై 26 నుండి ఆగస్టు 25 వరకు భారతదేశంలో 12.80 లక్షల ఖాతాలను X కార్ప్ తొలగించింది.ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 2,307 ఖాతాలను కూడా తొలగించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అదేవిధంగా, జూన్ 26 నుంచి జూలై 25 వరకు భారతదేశంలో 18.51 లక్షల ఖాతాలను నిషేధించారు.ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 2,865 ఖాతాలను తొలగించినట్టు భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube