ఫ్లిప్‌కార్ట్‌లో కిల్లర్ డీల్.. బడ్జెట్ ఫోన్‌గా మారిన ఐఫోన్ 11.. ధర ఎంత తగ్గిందో!!

మీరు ఐఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, దానికి ఇదే సరైన సమయం! ఎందుకంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్( Flipkart Big Billion Days ) ఐఫోన్ 11పై గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది.ఈ సేల్ అక్టోబర్ 15న ముగుస్తుంది, కాబట్టి త్వరపడండి.కొన్నేళ్ల క్రితం ఇండియాలో ఐఫోన్ 11 రూ.64,900 స్టార్టింగ్ ప్రైస్‌తో లాంచ్ అయింది.అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో దీన్ని రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు.ఇది లాంచ్ ప్రైస్‌లో దాదాపు 45% తగ్గింపు అని చెప్పవచ్చు.ఈ ధర 64GB వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.ప్రస్తుత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడానికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

 Flipkart Big Billion Days Huge Discount On Iphone 11,iphone 11, Iphone Offers, I-TeluguStop.com

ఐఫోన్ 11( iPhone 11 ) కోసం బ్యాంక్ ఆఫర్లు కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.ఆ ఆఫర్లతో ధర మరింత తగ్గించుకోవచ్చు.ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.బ్యాంక్ ఆఫర్లపై రూ.1,500 వరకు ఆదా చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మరిన్నింటి ద్వారా ఇతర తక్షణ తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి.

మీరు మీ ఓల్డ్ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేస్తే ఐఫోన్ 11పై మరింత తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజీ( Flipkart Exchange Offers )ల కోసం రూ.35,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది.అయితే, మీరు పొందే కచ్చితమైన తగ్గింపు ఓల్డ్ స్మార్ట్‌ఫోన్‌ వర్కింగ్ కండిషన్, స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది.పూర్తి రూ.35,000 తగ్గింపు లభించకపోయినా.మీరు ఇప్పటికీ మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 11 కొనుగోలుపై చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube