శ్రీలీలపై అలాంటి కామెంట్స్ చేసిన కాజల్.. అందరితో అలా ఉంటుందంటూ..

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Kajal Aggarwal Shocking Comments On Sreeleela, Balakrishna, Anil Ravipudi, Socia-TeluguStop.com

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా ఇప్పటికే అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ కెరీర్ లో వరుస అవకాశాలను అందుకుంటుంది.ఇక ఈ భామ వరుస అవకాశాలు వరిస్తున్న సమయం లోనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కూడా కనింది.

అటు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే కొంత విరామం తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈమెకు అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ భామ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా బరిలో రాబోతుంది.అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా చురుకుగా పాల్గొంటుంది.

తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

శ్రీలీల( Sreeleela ) చాలా తెలివైన అమ్మాయని ఆమె ఎంతో కష్టపడుతుంది.అందరితో ఎంతో విధేయతతో ఉంటుంది.తాను ఏం చేయాలని అనుకుందో స్పష్టంగా చేస్తుంది.

సెట్లో అందరితో సరదాగా ఉంటుంది.ఈతరం హీరోయిన్లకు ఇలాంటి లక్షణాలు తప్పకుండ ఉండాలి.

నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా వాడకం అంత ఎక్కువుగా లేదు.కానీ ఇప్పుడు ఏ విషయం అయినా అందులో వెంటనే తెలిసిపోతుందని ఈమె చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube