మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో తన అరెస్ట్ అక్రమమంటూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను సమర్పించాలని బండారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా అరెస్ట్ చేసిన సమయంలో తీసిన విజువల్స్ ను ఇవ్వాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం తదుపరి విచారణను ఏపీ హైకోర్టు వచ్చే నెల ఒకటో తేదికి వాయిదా వేసింది.







