కరీంనగర్( Karimnagar ) మంథనిలోని హనుమాన్ నగర్ లో ఓ మహిళా రేషన్ డీలర్ దారుణ హత్యకు గురైంది.ఈ హత్య ఘటన బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
లక్ష్మీపూర్ కు చెందిన బందెల రమేష్ కు ముత్తారం మండలానికి చెందిన రాజమణికు 20 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది.వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.
బందెల రాజేష్ 4 ఏళ్ల క్రితం మృతిచెందాడు.ఇక రాజమణి గ్రామంలో రేషన్ డీలర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది.
అయితే రేషన్ సరుకులు తెచ్చే సందర్భంలో ఆటో డ్రైవర్ సంతోష్ తో రాజమణి( Rajamani )కి పరిచయం ఏర్పడింది.తరచూ సంతోష్, రాజమణి ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.

కొంత కాలంగా సంతోష్, రాజమణి కి మధ్య విభేదాలు ఏర్పడడం వల్ల రాజేష్ ఆమె ఇంటికి రావడం మానేశాడు.ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజమణి సరుకుల కోసం వెళ్తున్నానని ఇంట్లో పిల్లలకు చెప్పి బయలుదేరింది.ఆరోజు తన చిన్న కూతురితో ఫోన్లో మాట్లాడింది కానీ అర్ధరాత్రి అయినా ఇంటికి తిరిగి వెళ్ళలేదు, పిల్లలు ఫోన్ చేసినా స్పందించలేదు.

మంగళవారం ఉదయం రాజమణి ఆచూకి కోసం వెతుకుతూ ఉండగా మంగళవారం రాత్రి మంథనిలోని ఎరుకుల గూడెంలో పైడాకుల సంతోష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో శవంగా కనిపించింది.మృతదేహం నుదుటి, గొంతులపై బలమైన గాయాలు ఉన్నాయి.వివాహేతర సంబంధమే ( Extra Marital Affair )ఈ హత్యకు కారణం అయి ఉంటుందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చేశారు.
మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.







