Skanda : అప్పుడే ఓటీటీలోకి.. బోయపాటి సినిమాను థియేటర్ లో నెల రోజులు కూడా ఆడించలేరా?

యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) దర్శకత్వంలో తాజాగా రామ్ హీరోగా నటించినటువంటి స్కంద సినిమా ( Skanda Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.భారీ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 Ram Pothineni Starrer Skanda To Stream On Disney Plus Hotstar-TeluguStop.com

శ్రీ లీల రామ్ హీరో హీరోయిన్లుగా తెరికెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేసింది.అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్ట లేకపోయింది.


Telugu Akhanda, Balakrishna, Boyapati Sreenu, Disney Hot, Ram Pothineni, Skanda,

ఇలా థియేటర్లో మిశ్రమ స్పందనతో కొనసాగుతున్నటువంటి ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోందని తెలుస్తుంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ( Disney+Hotstar ) కొనుగోలు చేశారు.ఇలా ఈ సినిమా హక్కులను దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ సినిమా ఈనెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుందని తెలుస్తుంది.ఇలా ఈ సినిమా విడుదల అయ్యి నెలరోజులు కూడా కాకుండానే ఇలా ఓటీటీ లోకి వస్తోందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.


Telugu Akhanda, Balakrishna, Boyapati Sreenu, Disney Hot, Ram Pothineni, Skanda,

బోయపాటి లాంటి ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో రామ్( Ram Pothineni ) హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల( Sreeleela ) హీరోయిన్గా నటించారు.ఇలా భారీ తారాగణంతో తెరకెక్కినటువంటి ఈ సినిమా నెలరోజులు కూడా థియేటర్లో ఆడలేకపోవడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఈ సినిమా నెల రోజుల్లో కూడా థియేటర్లో ఆడకుండానే ఓటీటీలోకి రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఎంత విఫలమైందో స్పష్టంగా తెలుస్తుంది.అక్టోబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్కంద సినిమా( Skanda Movie OTT Release ) ప్రసారం కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అధికారక ప్రకటన మాత్రం తెలియచేయలేదు.

అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను డిస్నీ ప్లస్ హాట్స్టార్ అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube