ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మధ్యంతర బెయిల్ పొడిగింపు అయింది.ఈ మేరకు మరో మూడు నెలల పాటు బెయిల్ ను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా మనీలాండరింగ్ కేసులో గత సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన నవాబ్ మాలిక్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఆయనపై వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ను మూడు నెలల పాటు పొడిగించింది.







