ప్రపంచంలో అన్ని ఇతర దేశాల కంటే ఇజ్రాయెల్ ఆవులే అత్యధికంగా పాలు ఇస్తాయి.ఒక ఇజ్రాయెల్ ఆవు( Israel Cows ) సంవత్సరానికి 12,000 కిలోగ్రాముల పాలను ఉత్పత్తి చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
వారి ఆవులు ఇజ్రాయెలీ-హోల్‌స్టెయిన్ జాతికి చెందినవి.వాటిని వారు చాలా జాగ్రత్తగా పెంచుతారు.
ఇజ్రాయెల్ ఆవులను ఉత్తమంగా సంరక్షించడమే కాకుండా ఆవుల నిర్వహణను కూడా ఆ దేశం ఉత్తమంగా చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి.ఈ క్రమంలో రోజువారీ వారి పాల దిగుబడి శాతాన్ని ఇతరులతో పరిశీలిస్తే… భారతీయ ఆవు 7.1 కిలోలు, బ్రిటిష్ ఆవు – 25.6, అమెరికన్ ఆవు – 32.8, అదే ఇజ్రాయెల్ ఆవు – 38.7 కిలోల మొత్తంలో పాలను ఇస్తుందని చెబుతున్నారు.

ఇజ్రాయెల్ అంతటా దాదాపు 1000 డైరీ ఫామ్‌లు ఉన్నాయి.2016లో, ఇజ్రాయెలీ డెయిరీ ఫామ్‌లు( Israel Diary Farms ) సుమారు 1,450 మిలియన్ లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేయగా వాటి విలువ సుమారు $2.5 బిలియన్లు.అక్కడ పాడి ఆవులను నడపడం కోసం ప్రత్యేక మేనేజ్‌మెంట్ కోర్సు వుందంటే మీరు నమ్ముతారా? అక్కడి యూనివర్సిటీల్లో కూడా ఇందుకు సంబంధించిన చదువులకు డిగ్రీలు ఇస్తారు కూడా.అంతేకాకుండా ఇజ్రాయెల్‌లో ఆవు పాలను( Cow Milk ) ఉపయోగించి 1000 కంటే ఎక్కువ విభిన్న పాల ఉత్పత్తులను తయారు చేస్తారు.డైరీలు పులియబెట్టిన పాలు మరియు స్వీట్లు, సాఫ్ట్ చీజ్, హార్డ్ జున్ను, వెన్న మరియు మరెన్నో ఉత్పత్తి చేసి విక్రయిస్తాయి.

ఈ క్రమంలోనే అక్కడ (ఇజ్రాయెల్) మొట్టమొదటి ఆధునిక డైరీ ఫామ్, ‘మిక్వే ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ స్కూల్’,( Mikveh Israel Agricultural School ) 1880లో స్థాపించబడింది.ఇక అక్కడ హోల్‌స్టెయిన్ జాతి ఆవు( Holstein Breed Cow ) ఉత్తమమైన జాతికి చెందినదిగా చెబుతారు.ఇజ్రాయెలీ డెయిరీ ఫామ్‌ల విజయానికి ఆకట్టుకునే సాంకేతిక పురోగతులు కారణమని చెప్పవచ్చు.వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటూ, ఇజ్రాయెల్ రైతులు తమ ఆవులను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు.
ఇజ్రాయెలీ డెయిరీ ఫామ్‌లలో మీరు స్థిరంగా అధిక నాణ్యత ఉండేలా రూపొందించబడిన ప్రపంచంలోని అత్యంత అధునాతన సాంకేతికతలను వినియోగిస్తారు.







