ఏపీలో సంబురాలు.. నేడు సామర్లకోటలో సామూహిక గృహా ప్రవేశాలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనడానికి నిదర్శనం.అదే నేటి మహత్తర కార్యక్రమం.

 Celebrations In Ap.. Mass House Entrances In Samarlakota Today-TeluguStop.com

ఒకేసారి ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఈ మేరకు నిర్వహించే సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Ap, Cm Ys Jagan, Poor, Jagananna, Mass, Houses, Samarlakota-Latest News -

రాష్ట్రంలో ప్రతి పేదవానికి సొంత ఇళ్లు ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పం.ప్రతి అక్కాచెల్లెమ్మ తన పిల్లపాపలతో సొంత ఇంటిలో ఉండాలని తన వంతుగా గొప్ప సాయం అందిస్తున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని సుమారు 30.75 లక్షల మందికి రూ.76వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు అందజేశారు.అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 21.76 లక్షల గృహాలు నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.అందుకోసం సుమారు రూ.56,700 కోట్ల ఖర్చు అవుతుందని తెలుస్తోంది.పెద్ద మొత్తమే అయినా ప్రజలకు సొంత ఇళ్లు ఇవ్వాలన్న తలంపు, ఇచ్చి తీరాలన్న ధృడ చిత్తం ముందు ఎలాంటి సమస్య అయినా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు.

దీంతో సీఎం జగన్ ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా వేలాదిగా జగనన్న కాలనీల కోసం స్థల సేకరణ చేసింది.అక్కడ ఇళ్లు నిర్మించేందుకు వీలుగా రోడ్లు, నీళ్లు, విద్యుత్, పార్కుల వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చారు.

ఈ క్రమంలోనే మెల్లగా ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది.పేద ప్రజలు తమకు వైసీపీ సర్కార్ ఇచ్చిన జాగాలో ప్రభుత్వ సాయంతో ఇళ్లు కట్టుకుంటున్నారు.ఎంత తక్కువగా లెక్కేసినా ఒక్కో ఇంటి ధర ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉంటుందని అంచనా.

Telugu Ap, Cm Ys Jagan, Poor, Jagananna, Mass, Houses, Samarlakota-Latest News -

సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు వాస్తవరూపం దాలుస్తుండడంతో రాష్ట్రంలో పేదల జీవన స్వరూపమే మారుతోంది.ఇళ్లులేని పేదలు ఇక మీదట ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో ఉండొచ్చు.ఏపీలో జగన్ ఆదేశాల మేరకు ఉద్యమం మాదిరిగా ఇళ్ల నిర్మాణాల కార్యక్రమాన్ని చేపడుతున్నారు అధికారులు.లబ్దిదారులకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నారు.ఇటుక, సిమెంట్, కంకర, ఐరన్, తలుపులు, గుమ్మాలు మరియు కిటీకీలను సైతం సమకూరుస్తూ నిర్మాణాలు త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే 5.24 లక్షల గృహాలు పూర్తవగా వాటిని నేడు లబ్ధిదారులకు అందజేయనున్నారు.ఈ క్రమంలో దాదాపు 2, 412 ఇళ్లను పూర్తి చేసుకున్న సామర్లకోట పట్టణంలో లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు అవుతున్నారు.

ఈ కాలనీల్లో ఇప్పటికే పార్కులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం అక్కడ నివాసానికి సకలం సమకూర్చింది.ఈ సందర్భంగా లబ్దిదారులతో పాటు సీఎం జగన్ సైతం వారి సంతోషాల్లో భాగం పంచుకోనున్నారు.

పేదల ఇళ్లలో చిరునవ్వులు పూయించేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషి ఫలవంతం అవుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube