భయపెడుతున్న గుర్తులు ! హైకోర్టుకు బీఆర్ఎస్ 

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఎన్నికల గుర్తులపై టెన్షన్ పట్టుకుంది .గతంలో జరిగిన ఉప ఎన్నికల్లోను, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోను బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు గుర్తును పోలి ఉండే విధంగా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తులు కారణంగా,  బీఆర్ఎస్ ( BRS )కు పడాల్సిన ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్లాయి.

 Scary Signs! Brs To The High Court , Brs Party, Telangana Government, Telangan-TeluguStop.com

దీంతో చాలాకాలంగా ఈ గుర్తులు విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూనే వస్తోంది.అయినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సరైన స్పందన రాకపోవడం,  మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆర్ట్ అయింది.

  అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారని కోరుతూ బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

తమ గుర్తులు పోలిన గుర్తులను ఇతరులకు కేటాయిస్తూ ఉండడం వల్ల ఎన్నికల్లో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని , కారు గుర్తుకు ఓటు వేయాలనుకుంటున్న వయోవృద్ధులు పొరపాటున ఇతర గుర్తులకు వేస్తున్నారని పిటిషన్ లో బీఆర్ఎస్ ( BRS )పేర్కొంది.  ఈ విషయమై ఇటీవల పార్టీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించారు.ఇక ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు రాబోతోంది.

దీనిపై తీర్పు ఏ విధంగా వస్తుందని టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది.  ముఖ్యంగా  రోడ్డు రోలర్ గుర్తును కారును పోలి ఉండే విధంగా ఉండడంతో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుపైన ఎక్కువ  పడుతుండడం తో ముందుగానే బీఆర్ఎస్ ( BRS )అలర్ట్ అవుతోంది.

రోడ్డు రోలర్ మాత్రమే కాకుండా,  రోటి మేకర్ గుర్తు కూడా బీఆర్ఎస్( BRS ) ఇబ్బందికరంగా మారింది.రోడ్డు రోలర్,  రోటి మేకర్ , కెమెరా డోలి,  టీవీ సోప్ బాక్స్,  కుట్టు మిషన్ వంటి వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని బీ ఆర్ ఎస్ ఎప్పటి నుంచో కోరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube