ఏఎన్ఆర్ నన్ను పొగిడింది లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అలనాటి నటి వాణిశ్రీ( Actress Vanishree ).1960లలో కెరీర్‌ని ప్రారంభించిన ప్రముఖ తెలుగు సినిమా నటి వాణిశ్రీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించింది.ఆమె వర్సటైల్ యాక్టింగ్ కు ప్రసిద్ధి చెందింది.ఆమె మరపురాని కో యాక్టర్స్ లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ), వీరిద్దరూ కలిసి ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు వంటి కొన్ని క్లాసిక్‌లతో సహా 26 చిత్రాలలో వారు కలిసి నటించారు.
వారు తెరపై హాట్ కెమిస్ట్రీని పండించారు.వారి రొమాన్స్, ఎమోషనల్ సన్నివేశాలను ప్రేక్షకులు మెచ్చుకున్నారు.వాణిశ్రీ అతన్ని తన గురువుగా, మార్గదర్శిగా భావించింది.అతను ఆమెను ప్రతిభావంతులైన, వృత్తిపరమైన నటిగా గౌరవించాడు.2014లో ఆయన చనిపోయే వరకు వారు మంచి స్నేహితులుగా ఉన్నారు.

వాణిశ్రీ సినీ ప్రయాణం, అక్కినేని నాగేశ్వరరావుతో ఆమెకున్న అనుబంధం సినిమా పట్ల ఆమెకున్న అంకితభావానికి ఉదాహరణలు.తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నటీమణులలో ఆమె ఒకరు.”నన్ను ఇద్దరే మెచ్చుకున్న వారు ఉన్నారు.వారిలో ఒకరు సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )మరొకరు కృష్ణంరాజు.మా అమ్మ కూడా నన్ను ఎప్పుడూ మెచ్చుకోలేదు.నేను నాగేశ్వరరావు తో చాలా సినిమాలు చేశాను.అయినా కూడా అతను ఒక్క సినిమా సమయంలో కూడా నన్ను మెచ్చుకోలేదు.‘వాణి శ్రీ నువ్వు అందంగా ఉన్నావ్!, ‘నువ్వు బాగా చేశావు’ అనే కాంప్లిమెంట్స్ ఏఎన్ఆర్ ఇస్తాడని నేను ఎంతో ఆశ పడ్డా, కానీ ఒక్కసారి కూడా అలా జరగలేదు.” కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వాణిశ్రీ వాపోయింది.

ఇక హీరో కృష్ణంరాజు తనను ఎంతో బాగా పొగిడేవాడని గుర్తు చేసుకుంది.తాను చీర కట్టుకొని పైటను భుజం పైనుంచి కిందికి తీసుకొచ్చే తీరు కృష్ణంరాజును ఎంతో ఆకట్టుకుందని ఆమె తెలిపింది.“తనని అలా చూసినప్పుడల్లా వండర్‌ఫుల్ గా చేశారు.అచ్చం రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీ లాగా మీరు నటిస్తున్నారు అంటూ నన్ను కృష్ణంరాజు బాగా పొగిడేవాడు.” అని ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చింది.ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతంలో ఆమె కృష్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ఇప్పుడు ఏఎన్నార్ తనను పొగడ లేదంటూ ఫిర్యాదులు చేసింది.ఏది ఏమైనా ఈ నటి అలనాటి ఎన్నో విషయాలు పంచుకుంటూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.







