బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఆద్యంతం ప్రేక్షకులను ఉలిక్కిపడి రేంజ్ ట్విస్టులతో, సరికొత్త గేమ్ ప్లానింగ్ తో కోట్లాది మంది అభిమానుల ఆదరణ ని దక్కించుకుంది ఈ రియాలిటీ షో.
ప్రస్తుతం ఈ షోలో కొత్తగా 5 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.గత ఆదివారం రోజు ఆడియన్స్ తో పాటుగా హౌస్ మేట్స్ బుర్రలు కూడా బ్లాక్ అయ్యాయి.
ఇక ఈ సీజన్ మొట్టమొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )ఎంపికైన సంగతి మన అందరికీ తెలిసిందే.కెప్టెన్ అయితే అయ్యాడు కానీ, ఒక కెప్టెన్ నిర్వహించాల్సిన భాద్యతలు మాత్రం సరైన పద్దతి లో నిర్వహించలేదని చూసిన ప్రతీ ప్రేక్షకుడికి అర్థం అయ్యింది.
అయితే ఈరోజు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ కి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో షాక్ ఇచ్చాడు.

కెప్టెన్ అంటే ఎలా ఉండాలి అని హౌస్ మేట్స్ అందరిని అడుగుతాడు.అప్పుడు హౌస్ మేట్స్ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు.చివరికి పల్లవి ప్రశాంత్ దగ్గరకి వచ్చేసరికి, కెప్టెన్( Captain ) అంటే ఇంట్లో వాళ్ళ చేత పనులు చేయిస్తూ,తానూ కూడా పని చెయ్యడమే అని అంటాడు.
కానీ ఇక్కడ ఎవ్వరూ నా మాట వినడం లేదు, నువ్వు మాకేంటి చెప్పేది అన్నట్టుగా చూస్తున్నారు బిగ్ బాస్ అని అంటాడు.అప్పుడు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ ఫెయిల్ అని ఎంత మంది అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడగగా, శివాజీ( Shivaji ) తో పాటుగా అందరూ పైకి చేతులు ఎత్తుతారు.
అప్పుడు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ కి మీ నుండి కెప్టెన్సీ ని లాగేసుకుంటున్నాము, మీ కెప్టెన్ బ్యాడ్జీని వెనక్కి ఇచ్చేయండి అంటాడు.ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ కెప్టెన్ హోదా ‘ఉల్టా పల్టా’ అయ్యింది.

అందరూ ఒక వైపు ఉంటే శివాజీ మాత్రం ఎలాంటి ప్రరిస్థితి లో అయినా పల్లవి ప్రశాంత్ వెంట ఉండేవాడు.అతనికి మొదటి రోజు నుండి సపోర్టు చేస్తూనే ఉన్నాడు.దీని వల్ల ఆయన ఎన్ని మాటలు ఎదురుకోవాల్సి వచ్చినా భరించాడు.అలాంటి శివాజీ కూడా నేడు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా పనికి రాడు అని చేతులు ఎత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కెప్టెన్సీ పోయిందని పల్లవి ప్రశాంత్ బాధపడుతున్న సమయం లో అమర్ దీప్ వచ్చి ఓదారుస్తున్నాడు.వీళ్లిద్దరు ఇక నుండి స్నేహితులు అవుతారేమో చూద్దాం.







